Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మన్యంలో కుప్పకూలిన డ్రోన్.. ఏంజరిగిందంటే?
posted on: Mar 27, 2026 2:04PM
.webp)
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో డ్రోన్ కుప్పకూలిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఓవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొని ఉండటం.. నిత్యం డ్రోన్ దాడులకు సంబంధించి వార్తలు వినవస్తుంటంలో ఆకాసం నుంచి ఓ డ్రోన్ వచ్చి పడటంతో స్థానికులు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. జి.మాడుగుల మండలం బొయితిలి సమీపంలో ఈ ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు అత్యవసరమైన వైద్య సేవలు అందించేందుకు రెడ్ వింగ్ సంస్థతో కలిసి ప్రభుత్వం డ్రోన్ల ద్వారా అత్యవసర మందులను వేగంగా తరలించేందుకు సంకల్పించింది. ఇందుకోసం ఎమర్జెన్సీ మెడికల్ ట్రయల్ రన్ చేపట్టింది.
ఆ ట్రయల్ రన్ లో ఉన్న డ్రోన్ బొయితిలి గ్రామ పరిసరాల్లో కూలిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆ పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రోన్ల ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించేందుకు జరుగుతున్న ట్రయల్ రన్ లో భాగంగా ఈ ఘటన జరిగిందని అధికారులు ధృవీకరించారు. ఎటువంటి ఆందోళనా అవసరం లేదని భరోసా ఇచ్చారు.






