ఇష్టం వచ్చినట్టు మందులు వాడారో మీ కిడ్నీలు పోతాయి...

 అనల్గేసిక్ నేఫ్రోపతి ....

అనల్గేసిక్ నేఫ్రో పతి  వల్ల  కిడ్నీలు పూర్తిగా పాడై  పోవడం జరుగుతుంది. దీనికికారణం ఎక్కువ మోతాదులో మందులు వాడడమే అని,ఒక దానిని ఎదుర్కోడానికి మరో మందు వేసుకోవడం వల్ల ముఖ్యంగా ఫేనాసిన్,అసెట మినోఫిన్,ఆస్ప్రిన్,లేదా ఇబుఫ్రుబిన్, అనలగేసిక్ నేప్రోపతి  కి కారణం గా పేర్కొన్నారు.ఒకే రకమైన మందు రోజుకు మూడు మందులు  ఆరు సంవత్సరాలుగా లేదా వారికీ వారే సెల్ఫ్ మెడి కేషన్  అనల్గేసిక్ నేఫ్రో పతి 1౦,౦౦౦ మందిలో ఒక నలుగురికి మాత్రమే వస్తుంది. ఆయితే ముఖ్యంగా 3౦ సంవత్సరాలు పై బడిన మహిళలలో రావడం గమనార్హం.ఈ సమస్య పరిష్కారానికి ఫేనాసిన్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అనల్గే శిక్ నేఫ్రోపతి కేసులు తగ్గుముఖం పట్టాయి. 

అనల్గేసిక్ నేఫ్రోపతి లక్షణాలు.... 

అయితే దీనికి ఏ రకమైన లక్షణాలు లేవని అంటున్నారు నిపుణులు.అనల్గేసిక్ నేఫ్రోపతి ని లక్షణాలను బట్టి అంచనా వేస్తారు త్వరగా అలిసిపోవడం,వెన్నుపూసలో తీవ్రమైన నొప్పి,మూత్ర వ్విసర్జనలో మార్పులు, మూత్రం లో రక్తం, గందర గోళం.ఒక్కోసారి రకరకాలుగా  రక్తస్రావం జరగడం.ఆహారం అరుగుదల కాక పోవడం. వాపు వంటి లక్షణాల ను బట్టి అనల్గేసిక్ నేఫ్రోపతి గా గుర్తిస్తారు. 

అనల్గేసిక్ నేఫ్రోపతి నిర్ధారణ పరీక్ష ....

అనాల్గేసిక్ నేఫ్రోపతి నిర్ధారణకు రక్తం లో ఏమైనా టాక్సికాలజీ పరీక్ష చేస్తారు.మూత్ర పరీక్ష సిబిసి పరీక్ష మూత్రం నుండి ఎటువంటి మెటీరియల్ బయటికి వస్తుంది అన్న పరీక్ష,ఐ వి పి పరీక్ష అంటే వైద్య పరిభాషలో ఇంట్రా వేనేనౌస్  పైలోగ్రాం వంటి పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. 

అనల్గేసిక్ నేఫ్రోపతి కి చికిత్స....

అనల్గేసిక్ నేఫ్రోపతి తీవ్రంగా ఉంటె అది కిడ్ని ఫైల్యూర్ గా నిర్ధారిస్తారు.దీనికి ఆహారం లో మార్పులు ,ఫ్లూయిడ్స్ లోఎంపిక చేసిననవి మాత్రమే వాడాల్సి ఉంటుంది.డయాలసిస్,లేదా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ .లేదా మీ కిడ్నీ తాత్కాలికంగా, లేదా శాస్వతంగా పాడుకవచ్చు.