Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...18ఏళ్లు దాటిన పిల్లల విషయంలో ఇలా చేయకండి..!
posted on: Feb 17, 2026 3:17PM

తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని అంటుంటారు. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి అతిపెద్ద కారణం చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత కూడా వారిపై నియంత్రణ కొనసాగించాలని అనుకుంటారు. వారి దృష్టిలో 18 ఏళ్లే కాదు.. పెళ్లైనా కూడా తమ పిల్లల విషయంలో నిర్ణయాలు పూర్తీగా తమవే కావాలని అనుకుంటారు. ఇలా పిల్లల విషయంలో అతిగా నియంత్రణ చేసే తల్లిదండ్రుల మూలాన పిల్లలు ఆత్మవిశ్వాసం కలిగి ఉండరని, వారికంటూ ప్రత్యేకత, వారి ప్రతిభ, వారి గుర్తింపు వారు పొందలేరని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
మారుతున్న కెరీర్.. చాలెంజెస్..
నేటి ప్రపంచంలో జీవన ప్రమాణాలు, కెరీర్ ఎంపికలు వేగంగా మారుతున్నాయి. దీని కారణంగా 18–34 సంవత్సరాల వయస్సు గల యువకులలో 33శాతం మంది స్వతంత్రంగా ఉండలేకపోతున్నారు. తల్లిదండ్రులతో కలిసి జీవించడం కంటే.. తల్లిదండ్రులే వారి జీవితాన్ని నిర్తేశించడం, వారిని నియంత్రణలో ఉంచడం జరుగుతోంది.
తల్లిదండ్రులు ఇలా పిల్లల విషయంలో నియంతలుగా ఉండటం కంటే.. వారికి స్నేహితులుగా ఉండాలని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. దీని వల్ల పిల్లలు తమ వయసుతో పాటు.. తమ జీవితం పట్ల ఒక స్పష్టత కూడా కలిగి ఉంటారు.
నిఘా పెడితే.. ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది..
చాలా మంది తల్లిదండ్రులు తెలియకుండానే హెలికాప్టర్ పేరెంటింగ్‌ను ఆశ్రయిస్తారు. అంటే తమ పిల్లలను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసం, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. హాస్టల్‌లో చదువు పూర్తి చేసుకున్న తర్వాత పిల్లలు పెద్దవారై ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఇంటి ఖర్చులు, పనులు, దాచి ఉంచవలసిన విషయాల గురించి పిల్లలతో కలిసి మాట్లాడాలని నిపుణులు చెబుతున్నారు. ఇది పిల్లలకు జీవితంలో పరిపక్వత పెంచే దిశగా అడుగులు వేయిస్తుంది.
అవగాహన తోనే కుటుంబ సంతోషం..
సంబంధాలలో అతిగా ఆధారపడటం మంచిది కాదు, కానీ అన్ని రకాలుగా ఆధారపడటాలు చెడ్డవి కావు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంత వయసు పెరిగా అన్ని విషయాలలోనూ తమ మీద ఆధారపడి ఉండాలని, పిల్లలు కేవలం చదువుకుని ఉద్యోహాలు తెచ్చుకున, తల్లిదండ్రుల ఇష్టప్రకారం జీవితాన్ని గడపాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది వారి జీవితాన్ని ఏదో ఒక రోజు కష్టాలలోకి నెట్టివేయడం లేదా తల్లిదండ్రుల మీద చెడు అభిప్రాయం ఏర్పడేలా చేయడానికి దారితీస్తుంది. పెద్దవారు లేకుండా పిల్లలు ఏదీ నేర్చుకోలేరు. కానీ పెద్దవారు చెప్పినట్టు జీవితాంతం పిల్లలు ఉండాలని అనుకోవడం చాలా తప్పు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన పిల్లలను ఒత్తిడి చేయకూడదు. వారితో స్నేహంగా ఉంటూ చర్చించడం ద్వారా వారి జీవితాన్ని మంచి దిశలో నడిపించేందుకు కృషి చేయాలంతే..
*రూపశ్రీ.






