డీఎంకే మేనిఫెస్టో ఒక సూపర్ స్టార్.. సీఎం స్టాలిన్

posted on: Mar 30, 2026 9:01AM

తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు అధికార డీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది.  ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ఆదివారం (మార్చి 29) చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం  అన్నా అరివళయం లో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోను ఆయన సూపర్ స్టార్ గా అభివర్ణించారు.  

మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించారు.  ఆదాయపు పన్ను పరిధిలోకి రాని కుటుంబాల్లోని మహిళలకు  ఇల్లతరసి  పథకం కింద గృహోపకరణాలు కొనుగోలుకు 8వేల రూపాయల విలువైన వన్ టైమ్ కూపన్ ప్రకటించారు.   ప్రస్తుతం మహిళా కుటుంబ పెద్దలకు నెలనెలా ఇస్తున్న  వెయ్యిరూపాయల ఈర్థిక సయాన్ని రెండు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు.  ఇక రైతు సంక్షేమానికి కూడా డీఎంకే మేనిఫెస్టో పెద్ద పీట వేసింది.  

వరి  మద్దతు ధరను క్వింటాల్ కు   3,500 రూపాయలకు,   చెరకు మద్దతు ధర టన్నుకురూ. 4,500కు పెంచుతామని హామీ ఇచ్చింది. అలాగే వ్యవసాయానికి మీటర్లు లేని ఆధునిక పంపుసెట్లను ఉచితంగా అందిస్తామని డీఎంకే మేనిఫెస్టో హామీ ఆచ్చింది.  సామాజిక భద్రతలో భాగంగా, వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను నెలకు రెండు వేల రూపాయలకు, దివ్యాంగుల పెన్షన్‌నురెండువేల ఐదువందల రూపాయలకు పెంచు తామన్న హామీని కూడా డీఎంకే మేనిఫెస్టోలో పొందుపరిచింది. 

  ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు అమలవుతున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరిస్తామనీ,  ఉన్నత విద్య అభ్యసించే 35 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని డీఎంకే మేనిఫెస్టో హామీ ఇచ్చింది. అలాగే ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం  కవరేజీని  10 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు, పథకానికి అర్హత ఆదాయ పరిమితిని ఏడాదికి ఐదు లక్షలకు పెంచుతామని పేర్కొంది. ఇంకా ఐదేళ్లలో  కలైంజర్ కనవు ఇల్లం  పథకం ద్వారా 1కొత్తగా 0 లక్షల  ఇళ్లు నిర్మిస్తామని పేర్కొంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...