వైసీపీ జిల్లా ప్లీనరీలలో రగులుతున అసమ్మతి

ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయలలో మూడో పార్టీకి స్థానం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికలల్లోనే ఆ విషయం రుజువైంది.ఆ ఎన్నికలలో, తెలుగు దేశం, వైసీపీ  బీజేపీ, కాంగ్రెస్’ జనసేన, వామపక్ష పార్టీలు, బీఎస్పీ ఇలా అనేక పార్టీలు కూటములు  పోటీ చేశాయి  అయినా, 90 శాతానికి పైగా ఓట్లు, టీడీపీ, వైసీపీల మధ్యనే పోల్ అయ్యాయి. సీట్ల విషయానికి వస్తే, 175 సీట్లకు గానూ 174 సీట్లు ఆ రెండు పార్టీలే పంచుకున్నాయి. మిగిలిన అన్ని పార్టీలకు కలిపి పది శాతం కంటే తక్కువ ఓట్లు, ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కాయి. అయితే, రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా, మార్పు రాదా, అంటే వస్తుంది. కానీ, ప్రస్తుతానికి  అయితే మరో ప్రత్యాన్మాయం కనిపించడం లేదని, పరిశీలకులు భావిస్తున్నారు. 

నిజానికి, ముందస్తు ఎన్నికలు వస్తే ఏమో కానీ, లేదంటే శాసన సభ ఎన్నికలకు ఇంకా చాలా సమయముంది. వైసేపీ ప్రభుత్వం గద్దెనెక్కి మూడు సంవత్సరాలే పూర్తయ్యాయి, ఇంకా  నిండా రెండు సంవత్సరాలు అలానే ఉన్నాయి. అయితే, ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పతాక స్థాయికి చేరింది. అందుకే, పార్టీలో అసమ్మతి అగ్గిరాజుకుంది. రాజీనామాల పర్వం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓ వంక ప్రజల విశ్వాసం  కోల్పోయింది. మరోవంక, పార్టీలో అసమ్మతి సెగలు బుసలు కొడుతున్నాయి.

అందుకే, రోజుకో రచ్చ వీధుల కెక్కుతోంది, అంతర్గత కుమ్ములాటలు, ధిక్కార స్వరాలు ఎక్కువ వుతున్నాయి...  బాలినేని భాగోతం ఓ వంక అలా సాగుతుడగానే.. మరో వంక వైసీపే జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశాల్లో కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెన్చుకుంటోందని వార్తలోస్తున్నాయి. ఇంకెవరో కాదు, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం తమ  నియోజకవర్గంలో వర్గ విబేధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ శ్రేణుల్లో మనస్పర్థలున్నాయని, అవి పార్టీకి మంచిది కాదని బొత్స చెప్పు కొచ్చారు.  

ఒంగోలు జిల్లా  ప్లీనరీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ‘ కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడు తున్న సమయంలోనే కార్యకర్తలు తాము చేసిన అభివృద్ది  పనులకు బిల్లులు ఎప్పుడు చేల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేయడంతో, పరిస్థితి రసాభాసగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని దురు సుగా ప్రవర్తించడంతో ఆ కార్యకర్త ఎదురు తిరిగాడు,  .‘వైసీపీకి ఓటు వేసి గెలిపించినందుకు అరెస్టు చేస్తారా? నేను ఏమి తప్పుచేశానని బయటకు తీసుకెళ్తున్నారు?’ అంటూ ఆక్రోశించారు.

నిజానికి పెండింగ్ బిల్లుల వ్యవహారం, వైసీపీ ఎమ్మెల్యేలకు సంకటంగా మారింది. ఈ నేపధ్యం లోనే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేనుగోపాల్, నేరుగా ముఖ్యత్రికే చురకలు అంటించారు. మీట నొక్కి ప్రజల ఖాతాలలో డబ్బులు వేస్తున్న ముఖ్యమంత్రి గ్రాఫ్ పెరుగుతోంది,  కానీ, ఏమీ చేయలేక చేతులు ముడుచుకు కూర్చున్న తమ ఫీజులు మాడి పోతున్నాయని అన్నారు. ఒక్క  దర్శి నియోజకవర్గం పరిధిలోనే  రూ.100 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని,అన్నారు.  నాలుగు రూపాయలు సంపాదించుకుందామని కాంట్రాక్టు పనులు చేసిన కార్యకర్తలు ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవలసి వస్తోందని, బహిరంగ వేదిక నుంచే ఆగ్రహం వ్యక్త చేశారు. 

నిజానికి ఇది ఎదో ఒక జిల్లాకు పరిమితమైన సమస్య కాదు. అన్నిజిల్లాలలో పైరవీలు చేసి పనులు తెచ్చుకున్న పార్టీ కార్యకర్తలు (కాంట్రాక్టర్ర్లు) అందరిది ఇదే సమస్యగా ఉందని నాయకులే వాపోతున్నారు. అలాగే, కర్నూలు జిల్లా ప్లీనరీలో గొప్పలు చెప్పుకోవడం తప్ప అభివృద్ధికి ఏం చేశారు? మంచినీరు కూడా ఇవ్వనప్పుడు ఏం అభివృద్ధి చేసినట్లు అని కుర్ని వెల్ఫేర్‌ అండ్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కృష్ణవేణి మంత్రి గుమ్మనూరు జయరాం సమక్షంలో నాయకులను ప్రశ్నించారు. 

మరో వంక పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య రాయచోటిలో జరిగిన అన్నమయ్య జిల్లా ప్లీనరీలో మాట్లాడుతూ  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ  అధికారం నిలబెట్టుకోవడం అంత సులభం కాదని, కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర నాయకత్వం అంతా బాగుదని అనుకుంటే ఇంతే సంగతులని, పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని హెచ్చరించారు

ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మొత్తానికి మొత్తంగా 175 సీట్లు మనవే అంటుంటే, రామచంద్రయ్య పార్టీ వేదిక నుంచే అంత సీన్ లేదని తేల్చేశారు. నిజానికి ఒక రామచంద్రయ్య కాదు. పార్టీ నాయకులు,  కార్యకర్తఃల్లో మూడింట రెండు వంతుల మంది ఇదే ఆఖరి మోకా ఇక ముందు అధికారంలోకి రాలేమని ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. గడప గడపకు కార్యక్రమంతో  ప్రజల్లో గుడ్తుకట్టున్న ప్రభుత్వ వ్యతిరేకత  భగ్గు మంటే, ఇప్పడు ప్లీనరీ సమావేశాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలో రగులుతున్న అసంతృపతి భగ్గుమంటోందని పరిశీలకులు అంటున్నారు. ఈ  నేపధ్యంలో, ప్రజల ముందు కనిపిస్తున్న ఏకైక ప్రత్యాన్మాయం తెలుగు దేశం, అందుకే ప్రజలు, పరిశీలకులు పొత్తులు ఉన్న లేకున్నా, ఎన్నికలు ఎప్పుడొచ్చినా .. గెలిచేది టీడీపీ .. అంటున్నారు.