Top Stories

పోసాని కూడా అందగాడేనా జగనూ?.. ఒక రేంజ్లో ట్రోల్ అవుతున్న మాజీ సీఎం

విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన మాటలు రోజులు గుడుస్తున్నా ఇంకా ట్రోల్ అవుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా వైసీపీలోని కమ్మ నేతల అందం గురించి మాట్లాడిన జగన్ ఒక రేంజ్లో ట్రోల్ అవుతున్నారు.. ఆ ఎఫెక్ట్‌తో ఆయన తీరు వైసీపీ నేత‌ల‌కు, కార్యక‌ర్తలకే అంతుప‌ట్టడం లేదంట.  వాస్తవానికి జగన్‌కి ఉన్నంత ఇగో ఫీలింగ్, డామినేషన్ నేచర్ ఇంకే పొలిటీషియన్‌కి ఉండవన్న అభిప్రాయం ఉంది. ఓట్ల వర్షం కురవడానికి తన ఫొటో ఉంటే చాలు ఇంకెవరూ అక్కర్లేదన్నట్లు ఆయన వ్యవహార తీరు ఉండేది. వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్ అదే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వ్యవహరించారు అనడానికి  పలు ఉదంతాలు ఉన్నాయి. 2014 ఎన్నికల ముందు నంద్యాల ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు జగన్ ఉన్న వేదిక మీదే అప్పటి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా ఉన్నారు. బడా ఇండస్ర్టియలిస్ట్ అయిన ఎస్పీవై రెడ్డి ఆజానుబాహుడు. వైట్ అండ్ వైట్ డ్రస్‌లో హుందాగా కనిపించే వారు. ఆయన వేదికపై జగన్ పక్కన నుంచోవడంతో సహజంగానే జగన్ కాస్తంత పొట్టిగా కనిపించి ఫిజికల్‌గా తేలిపోయారంట. దాంతో జగన్ వెంటనే అన్నా నువ్వు డయాస్ దిగు అని ఆ పెద్దాయన్ని వేదిక మీద నుంచి దింపే శారంట. ఈ ఉదంతాన్ని వైసీపీ సీనియర్లు, నంద్యాల నేతలు ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటారు. అప్పట్లో సీని నటులు జీవితా, రాజశేఖర్ దంపతులు వైసీపీలో చేరి జగన్ కోసం ప్రచారం చేశారు. జగన్‌తో కలిసి వివిధ సభల్లో పాల్గొన్నారు. అయితే రాజశేఖర్ తనదైన కాస్ట్యూమ్స్, మేకప్‌తో  వేదికపై తనను డామినేట్ చేస్తున్నారని జగన్ ఆ దంపతులను దూరం పెట్టేశారన్న ప్రచారం గట్టిగానే జరిగింది. రోజాకు కూడా అధికారిక కార్యక్రమాలకు మేకప్‌తో రావొద్దని వార్నింగ్ ఇవ్వడం వల్లే ఆమె అసెంబ్లీలో, పార్టీ కార్యక్రమాల్లో ఒరిజినల్ గెటప్‌తో కనిపించారంట అట్లాంటి జగన్ అధికారం చేజారగానే తన ఇగోలు, డామినేషన్‌లు పక్కన పెట్టి కొత్త రాగం ఎత్తుకుంటూ అభాసుపాలవుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారాలతో సహా దొరికిపోయి బెజవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చిన జగన్.. ఆ పరామర్శ పూర్తయ్యాక జైలు ముందే మీడియా ముందుకొచ్చారు .. చంద్రబాబు  తన కుటుంబం తప్ప కమ్మ సామాజిక వ‌ర్గంలో ఎవ‌ర్నీ పైకిరానివ్వరు.. అందుకే  రాజ‌కీయంగా ఎదుగుతున్న కొడాలి నాని, వ‌ల్ల‌భనేని వంశీ, దేవినేని అవినాశ్ ల‌పై క‌క్షపూరితంగా వ్యవ‌హ‌రిస్తున్నారని సరికొత్త రాగం ఎత్తుకున్నారు. అంతవరకు ఓకే కాని జగన్ తన స్థాయిని కూడా మర్చిపోయినట్లు స్క్రిప్ట్‌లో రాసిచ్చిన డైలాగులు వల్లె వేసి అభాసుపాలయ్యారు. తన పార్టీ నేతల గ్లామర్ గురించి మాట్లాడిన జగన్ వాళ్లు అందగాళ్లని కితాబిచ్చారు.  చంద్రబాబు, లోకేశ్ కంటే వ‌ల్లభ‌నేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాశ్ లు అందంగా ఉంటార‌ట‌. తమ సామాజికవర్గానికి చెందిన అలాంటి వాళ్ల రాజకీయ ఎదుగుదలని చూసి ఓర్వలేకే  చంద్రబాబు అక్రమ కేసులు పెట్టిస్తున్నారంట ... అందులో భాగంగానే క‌క్షపూరితంగా వ‌ల్లభ‌నేని వంశీపై అక్రమ‌ కేసులు పెట్టార‌ట‌.. కొడాలి నాని, అవినాశ్ కూడా గ్లామర్‌గా ఉండ‌టంతో వారినీ త్వర‌లోనే కేసుల్లో ఇరికిస్తారని జగన్ జోస్యం చెప్పేశారు. అరెస్టుల పర్వంలో జగన్ లెక్కలు తప్పి ఇప్పుడు పోసాని కృష్ణమురళీ వంతు వచ్చింది. ఫోన్లో పోసాని భార్యను పరామర్శించి ధైర్యం చెప్పిన జగన్.. ఆ కేసు చూసుకోవడానికి తన న్యాయకోవిదుల్ని కూడా నియమించారు. అంతవరకు బానే ఉన్నా పోసాని గ్లామర్‌ను జగన్ ఎవరితో పోలుస్తారో అన్న సెటైర్లు మొదలయ్యాయి. పోసాని కూడా లోకేష్ కంటే అందగాడని అందుకే అరెస్ట్ చేశారని జగన్ ఎక్కడ స్టేట్‌మెంట్ ఇస్తారో? అని వైసీపీ శ్రేణులు బిక్కుబిక్కుమంటున్నాయంట.  అయినా మగవాళ్ల అందం గురించి అందునా రాజకీయ నాయకుల అందం గురించి మాజీ సీఎం  జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం ఏంటో అర్ధం కావటం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బహుశా అలాంటి వ్యాఖ్యలు చేసిన మొదటి, ఆఖరి మాజీ ముఖ్యమంత్రి జగనేనేమో.
పోసాని కూడా అందగాడేనా జగనూ?.. ఒక రేంజ్లో ట్రోల్ అవుతున్న మాజీ సీఎం Publish Date: Feb 28, 2025 11:29AM

హైదరాబాద్ కు మీనాక్షి నటరాజన్.. స్వాగతం పలికిన టీపీసీసీ చీఫ్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ  వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్  శుక్రవారం (ఫిబ్రవరి 28) ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా మీనాక్షీ నటరాజన్ రాష్ట్ర పర్యటనకు రావడం ఇదే  తొలిసారి. రైలు మార్గం ద్వారా హైదరాబాద్ కు వచ్చిన ఆమెకు కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆమెకు తెలంగాణ  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్,  ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, ఫహీం, రచమల్లు సిద్ధేశ్వర్ ఇతర కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు.  మీనాక్షి నటరాజన్ స్వయంగా ఆదేశించడంతో ఆమె రాక సందర్భంగా ఎక్కడా ఫ్లెక్సీల హడావుడి కనిపించలేదు. కాగా మీనాక్షి నటరాజన్ ను ఆమె బస చేసిన దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.  అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నేతలూ కూడా ఆమెతో భేటీ అయ్యారు. 
హైదరాబాద్ కు మీనాక్షి నటరాజన్.. స్వాగతం పలికిన టీపీసీసీ చీఫ్ Publish Date: Feb 28, 2025 11:12AM

చంద్రబాబును కల్సిన  పిటీ ఉష  

ఎపి  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష భేటీ అయ్యారు. 2029లో ఆంధ్రప్రదేశ్ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని  చంద్రబాబు ఆమె మద్దత్తు కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు. నూతన క్రీడా విధానం, అథ్లెట్లకు శిక్షణపై వీరువురు చర్చించారు. అమరావతిలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సీ ఏర్పాటు,  స్పోర్ట్స్ సిటీ అభివృద్దిపై చర్చించారు.  రాష్ట్రానికి స్పోర్ట్స్ అథారటీ  ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు చంద్రబాబు ఆమె మద్దత్తు కోరారు. 
చంద్రబాబును కల్సిన  పిటీ ఉష   Publish Date: Feb 28, 2025 11:08AM

జయప్రద ఇంట విషాదం... సోదరుడు కన్నుమూత

ప్రముఖ సినీ న‌టి, అలనాటి హీరోయిన్  జ‌య‌ప్ర‌ద ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె సోద‌రుడు రాజ‌బాబు క‌న్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియ‌జేశారు. హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసంలో గురువారం మ‌ధ్యాహ్నం రాజ‌బాబు మ‌ర‌ణించిన‌ట్లు జ‌య‌ప్ర‌ద తెలిపారు.  జయప్రద 14 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యారు. 1976లో కెరీర్ ప్రారంభించి దాదాపు 300 సినిమాల్లో నటించారు. 2005 ఆమె చివరి చిత్రం. రాజకీయాల్లో  తెలుగుదేశం పార్టీలో అరంగేట్రం చేశారు. విభేధాల కారణంగా ఆమె సమాజ్ వాది పార్టీలో చేరారు. పార్టీ ప్రదాన కార్యదర్శి అమర్ సింగ్  వెన్నంటే ఉన్నారు.  రెండుసార్లు  ఉత్తర ప్రదేశ్ రాంపూర్ లోకసభ నుంచి ఎంపీ గా గెలుపొందారు. ఆయన మరణం తర్వాత జయప్రద స్వంత పార్టీని ఏర్పాటు చేసి విఫలమయ్యారు. ప్రస్తుతం ఆమె బిజెపిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఫౌజీలో ఆమె కీలకపాత్ర పోషించారు. 
జయప్రద ఇంట విషాదం... సోదరుడు కన్నుమూత Publish Date: Feb 28, 2025 10:46AM

పోలవరం ప్రాజెక్టు కోసం రూ.6705 కోట్ల రూపాయలు

ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2025-26లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర విత్తమంత్రి పయ్యావుల కేశవ్ భారీగా కేటాయింపు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు కోసం ఆయన 6 వేల705 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక జలజీవన్ మిషన్ కు 2, 800 కోట్ల రూపాయలు కేటాయించారు.  అలాగే వివిధ శాఖలు, రంగాలు, పథకాలకు ఆయన చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.. వ్యవసాయ, అనుబంధ రంగాలు.. రూ.13,487 కోట్లు పౌరసరఫరాల శాఖ..  రూ.3,806 కోట్లు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ..  రూ.1,228 కోట్లు బీసీల సంక్షేమం.. రూ.47,456 కోట్లు ఎస్సీల సంక్షేమం.. రూ.20,281 కోట్లు ఎస్టీల సంక్షేమం.. రూ.8,159 కోట్లు అల్పసంఖ్యాక వర్గాలు.. రూ.5,434 కోట్లు మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం..  రూ.4,332 కోట్లు వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం..  రూ.19,264 కోట్లు పరిశ్రమలు, వాణిజ్య శాఖ.. రూ.3,156 కోట్లు రోడ్లు, భవనాలు.. రూ.8,785 కోట్లు యువజన, సాంస్కృతిక శాఖ..  రూ.469 కోట్లు తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం..  రూ.10 కోట్లు నవోదయ 2.0 .. రూ.10 కోట్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం.. రూ.3,486 కోట్లు రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన.. రూ.500 కోట్లు ధరల స్థిరీకరణ నిధి..  రూ.300 కోట్లు ఐటీఐ, ఐఐఐటిలు.. రూ.210 కోట్లు దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన..  రూ.745 కోట్లు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌..  రూ.10కోట్లు ప్రకృతి సేద్యం ప్రోత్సాహం..  రూ.62 కోట్లు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు.. రూ. 11,314 కోట్లు మత్స్యకార భరోసా.. రూ.450 కోట్లు
పోలవరం ప్రాజెక్టు కోసం రూ.6705 కోట్ల రూపాయలు Publish Date: Feb 28, 2025 10:35AM

హోంశాఖకు రూ.84570 కోట్లు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ లో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారీ కేటాయింపులు చేశారు. ఇందు కోసం రాష్ట్ర హోంశాకలకు 8570 కోట్ల రూపాయలు కేటాయించారు. గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందనీ, జగన్ సర్కార్ తీరు కారణంగా పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతిందనీ పేర్కొన్న పయ్యావుల కేశవ్, దాని పర్యవశానంగా రాష్ట్రంలో సామాన్యులు ప్రశాంతంగా, భద్రంగా బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.   పోలీస్ దళం ఆధునీకరణ,  6,100 మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ ఎలైట్ యాంటి నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ ఫోర్స్ మెంట్ (ఈగల్)' ఏర్పాటు, ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, పెట్రోలింగ్ సహా పటిష్ట నిఘా  కోసం పోలీస్ వాహనాల కొనుగోలు, గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు 'నవోదయం 2.0' కార్యక్రమం,  ఆల్కహాల్ డీ-అడిక్షన్ సహా వ్యసనాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిధులను కేటాయించారు. 
హోంశాఖకు రూ.84570 కోట్లు Publish Date: Feb 28, 2025 10:22AM