Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీమాంధ్రకి చెత్త ఈవీఎంలు పంపించారు
posted on: May 7, 2014 10:51AM

సీమాంధ్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం, దాని కనుసన్నల్లో నడిచే ఎన్నికల కమిషన్‌కి వున్న నిర్లక్ష్య ధోరణి మరోసారి బయటపడింది. తెలంగాణలో పోలింగ్ జరిగినప్పుడు ఈవీఎంలు మొరాయించిన సంఘటనలు చాలా తక్కువగా జరిగాయి. అయితే సీమాంధ్రలో మాత్రం ఈరోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఈవీఎంలు మొరాయిస్తూనే వున్నాయి.
సీమాంధ్ర అంతటా కొన్ని వందల పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అంటే సీమాంధ్రకు చెత్త ఈవీఎంలను పంపారని అర్థమవుతోంది. ఈవీఎంలు అసలు పనిచేయకుండా చచ్చిపోయిన సంఘటనలు అనేకం వున్నాయి. వీటితోపాటు ఈవీఎంలు అనేకరకాల లీలలు బయటపడుతున్నాయి. ఒకచోట ఒక ఓటు వేస్తే పదిహేను ఓట్లు పడుతున్నాయి. మరోచోట ఎవరికి ఓటు వేసినా ఫ్యాన్ గుర్తుకే పడుతున్నాయి.
ఇంకోచోట పోలింగ్ ప్రారంభం కాగానే ఈవీఎం పనిచేయకపోవడంతో పోలింగ్ అధికారిణికి బీపీ పెరిగిపోయి స్పృహ తప్పి పడిపోయారు. ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల సీమాంధ్రలో ఉదయం పదకొండు గంటల వరకూ కొన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ముందు జాగ్రత్తగా పెట్టుకున్న ఈవీఎంలు కూడా పనిచేయకుండా మొరాయిస్తున్నాయంటే సీమాంధ్రకు ఎన్నికల కమిషన్ ఎంత చెత్త ఈవీఎంలు పంపిందో అర్థం చేసుకోవచ్చు. ఈవీఎంల సాంకేతిక సమస్యలు ఇలా వుంటే కొన్ని చోట్ల ఒక పార్టీ అభ్యర్థి పేరు ముందు మరో పార్టీ గుర్తు వుండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు.


.jpg)
.jpg)


