Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మీకు తెలియకుండానే మీ మెదడు మిమ్మల్ని మోసం చేస్తుందని మీకు తెలుసా..ఇదిగో ఆధారాలు..!
posted on: Aug 11, 2026 6:43PM

మనిషి మెదడు చాలా శక్తివంతమైనది. మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది. కానీ మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. అయితే మనిషి మెదడు ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉండదని అంటున్నారు నిపుణులు. సమాచారాన్ని వేగంగా గ్రహించడంలో సహాయపడటానికి.. మనస్సు కాగ్నిటివ్ బయాసెస్ అని పిలువబడే మానసిక పరిస్థితి పై ఆధారపడుతుంది. ఈ మార్గాలు సమయాన్ని ఆదా చేయగలిగినప్పటికీ, అవి ఆలోచించే, నిర్ణయాలు తీసుకునే , చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకునే విధానాన్ని కూడా వక్రీకరించగలవని అంటున్నారు. దీని ఫలితంగా మెదడు ఒక విషయాన్ని వేరేగా అన్వయించుకుంటుంది, అందుకే అదే నిజమని నమ్మే అవకాశం ఉంటుంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
నిర్థారణలో పక్షపాతం..
ఇప్పటికే నమ్ముతున్న విషయాలను బలపరిచే సమాచారం కోసం మెదడు సహజంగానే వెతుకుతూ ఉంటుందట. ఎవరితోనైనా విభేదిస్తే, వారితో విభేధించడానికి గల అభిప్రాయానికి గల కారణాలను, సాక్ష్యాలను విస్మరించి, వారు తప్పు అని చెప్పడానికి గల ప్రతి కారణంపై దృష్టి పెడతారట. నిజాన్ని తెలుసుకోవడానికి బదులుగా, మనస్సు తరచుగా తను అనుకున్నదే కరెక్ట్ అనే విషయాన్ని నిరూపించడం కోసం వెతుకుతూ ఉంటుందట. ఇలా నిజాలు తెలుసుకునే విషయంలో మెదడు పక్షపాతం వహిస్తుందట.
హెలో ఎఫెక్ట్..
చాలామంది చక్కగా దుస్తులు ధరించి, శుభ్రంగా ఉంటూ, చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటుంటారు. ఇలాంటి వారి విషయంలో చాలామంది పాజిటివ్ గానూ, వాళ్లదిమంచి వ్యక్తిత్వం అని అనుకుంటారు. దీని కారణం మెదడే.. ఇలాంటి వాళ్లు మంచోళ్లు అని మెదడు అనుకుంటుందట. ఇలాంటి ప్రభావాన్ని హెలో ఎఫెక్ట్ అని అంటారు. ఒక వ్యక్తిలో మంచి గుణాన్ని గమనించినప్పుడు, ఎటువంటి నిజమైన ఆధారం లేకపోయినా, మెదడు వారికి ఇతర మంచి లక్షణాలు కూడా ఉన్నాయని దానంతట అదే ఊహించుకుంటుంది. వాస్తవాల ఆధారంగా ఒకరిని అంచనా వేయడానికి బదులుగా, మనస్సు దానికి నచ్చినట్టు మంచి మంచి స్టోరీస్ ను ఊహించుకుని మరీ వారిని చాలా మంచోళ్లను, అన్నీ మంచి గుణాలే ఉన్నోళ్లుగా భావిస్తుంది.
ఎమోషనల్ లాజిక్..
ఎమోషన్స్ అనేవి వాస్తవాన్ని చూసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైనా ఆందోళనగా అనిపిస్తే, ఆ పరిస్థితి ప్రమాదకరమైనదని అనుకోవడం, ఎందులో అయినా ఫెయిల్యూర్ ఎదురైతే నిజంగానే పూర్తీగా విఫలమయ్యారని అనుకోవడం జరుగుతుంది. మనిషిలో ఉండే ఫీలింగ్స్ సరైనవే అయినప్పటికీ, అవి ఎల్లప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండవు. ఎమోషన్స్ ను వాస్తవాల నుండి వేరు చేయడానికి కొంత సమయం తీసుకోవాలి, యాంత్రికంగా రియాక్ట్ అయ్యే బదులు మరింత ఆలోచనాత్మకంగా స్పందించాలి. అలా ఉంటేనే మంచిది. లేకపోతే మెదడు చేతిలో మోసపోవాల్సి వస్తుంది.
సన్క్ కాస్ట్ పాలసీ..
ఇప్పటికే చాలా సమయం , శ్రమను ఒక పని కోసం వెచ్చించారు అనే కారణంతో అందులో అలాగే కొనసాగుతూ ఉంటే దాన్ని 'సన్క్ కాస్ట్ ఫాలసీ' (sunk cost fallacy) అంటారు. మెదడు తరచుగా గత పెట్టుబడిని భవిష్యత్ విలువతో గందరగోళానికి గురిచేస్తుంది. దీనివల్ల ఏదైనా ఇకపై ఉపయోగపడకపోయినా దాని నుండి బయటపడటం కష్టమవుతుంది. ఇప్పటికే గడిపిన సమయాన్ని తిరిగి పొందలేరని గుర్తుంచుకోవాలి. ఎలా ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారో అదే అత్యంత ముఖ్యం.
నెగిటివ్ ప్రభావం..
ఎవరైనా విమర్మించినప్పుడు, తిట్టినప్పుడు, బాధపెట్టినప్పుడు.. అది రోజుల తరబడి మనసులో నిలిచిపోతుంది, కానీ ఎన్నో మంచి విషయాలు, సంతోషకరమైన విషయాలు త్వరగా మర్చిపోతారు. ఇలా జరగడానికి కారణం, మెదడు సహజంగానే సానుకూల అనుభవాల కంటే ప్రతికూల అనుభవాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం. ఇది ఒకప్పుడు, ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉండటానికి, మానవులు మనుగడ సాగించడానికి సహాయపడింది. అయితే ఈ రోజుల్లో, ఇది రోజువారీ ఎదురుదెబ్బలను అవి నిజంగా ఉన్నదానికంటే చాలా పెద్దవిగా అనిపించేలా చేస్తుంది. నెగిటివ్ కంటే పాజిటివ్ ను మెదడులో ఇముడ్చుకోవాలి. అప్పుడే మెదడు పనితీరు ఆరోగ్యకరంగా ఉన్నట్టు.
స్పాట్ లైట్ ఎఫెక్ట్..
తప్పులను, రూపాన్ని, లేదా ఒక ఇబ్బందికరమైన క్షణాన్ని అందరూ గమనిస్తారని నమ్మడం చాలా సులభం. వాస్తవానికి, చాలా మంది తమ సొంత జీవితాలు , విషయాలపైనే దృష్టి పెడతారు. ఈ స్పాట్‌లైట్ ఎఫెక్ట్ వల్ల అందరూ తమను నిరంతరం గమనిస్తున్నారనే భావన కలుగుతుంది. కానీ నిజానికి అలా జరగకపోయినా అదేలా భావిస్తుంటారు. ఈ ఆలోచనను వదిలేయడం వల్ల, రోజువారీ జీవితంలో మరింత ఆత్మవిశ్వాసంతో, తక్కువ భయంతో ఉండటానికి సహాయపడుతుంది.
పైన చెప్పుకున్నవిధంగా.. వివిధ కారణాల వల్ల చాలామందికి తమ మెదడే శత్రువులా మారి మోసం చేస్తుంది.
*రూపశ్రీ.


.webp)


