హైకోర్టులో మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్వల్ప ఊరట కలిగించింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిపై ఏప్రిల్ 3వ తేదీ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని సీఐడీకి ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ ససింది.  ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.  మద్యం కుంభకోణం కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచార జరిగిన సంగతి తెలిసిందే.   కోట్లాది రూపాయల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని ఈ కేసు ఏపీ సీఐడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మిథున్ రెడ్డి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఈ కేసులో తుది తీర్పు వెలుువడే వరకూ అంటే ఏప్రిల్ 3 వరకూ ఎంపీ మిథున్ నెడ్డిపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దనీ, అరెస్టు చేయవద్దనీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  కాగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అంశాన్ని తెలుగుదేశం ఎంపీ లావు కృష్ణదేవరాయులు లోక్ సభలో లేవనెత్తారు. ఏపీ మద్యం కుంభకోణంలో పోలస్తే డిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదన్న ఆయన ఈ విషయంలో మనీ ల్యాండరింగ్ కూడా జరిగిందని ఆరోపిస్తూ ఈడీ దర్యాప్తునకు  డిమాండ్ చేశారు.   దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిధున్ రెడ్డిని పార్లమెంటు ఆవరణలోని తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ ఈ కుంభకోణంపై ఆరా తీశారు. హోంమంత్రితో భేటీ అనంతరం హుటాహుటిన అమరావతికి వచ్చిన ఎంపీ కృష్ణ దేవరాయులు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.  ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ మద్యం కుంబకోణం కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  
హైకోర్టులో మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట Publish Date: Mar 27, 2025 10:29AM

కార్ల దిగుమతిపై పాతిక శాతం సుంకం పెంపు.. ట్రంప్ మరో సంచలనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అమెరికా ఫస్ట్ అంటూ వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ప్రపంచ దేశాలకు షాక్ లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా విదేశీ కార్ల దిగుమతిపై పాతిక శాతం సుంకం పెంచుతే నిర్ణయం తీసుకున్నరు. అమెరికాలో తయారు కాని అన్ని కార్లపై ఈ పాతిక శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. జఅయితే అమెరికాలో తయారైన కార్లపై మాత్రం ఎటువంటి సుంకం ఉండదు.  ఈ కొత్త దిగుమతి సుంకం ఏప్రిల్ 3 నుంచి అమలులోకి రానుంది.  దేశీయ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు.  అయితే ఈ తాజా సుంకం నిర్ణయం కారణంగా ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా, ఆటో మేకర్ సరఫరా చైన్ ను దెబ్బతీస్తుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రపంచ వాణిజ్య సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు.  
కార్ల దిగుమతిపై పాతిక శాతం సుంకం పెంపు.. ట్రంప్ మరో  సంచలనం Publish Date: Mar 27, 2025 10:11AM

యూపీ సీఎం యోగికి తప్పిన ప్రమాదం

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‎కు తృటిలో  ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.  వివరాలిలా ఉన్నాయి.   యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎనిమిదేళ్ల పాలనను పురస్కరించుకుని లక్నోలోని ఇందిరా గాంధీ స్టేడియంలో బుధవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు యోగి ఆదిత్యనాథ్ ఆగ్రా నుంచి ప్రత్యేక విమానంలో  బయలుదేశారు. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటిలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్ వెంటనే విమానాన్ని ఆగ్రా విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు.  ఆ తరువాత అధికారలు ఢిల్లీ నుంచి మరో విమానం రప్పించారు.   విమానంలో సాంకేతిక లోపం కారణంగా లక్నోలో సీఎం యోగి పాల్గొనాల్సిన కార్యక్రమం రద్దు అయ్యింది. ఇలా ఉండగా యూపీ సీఎం యోగి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.   సాంకేతిక సమస్యకు కారణాలేమిటన్న దానిపై ఫ్లైట్ ఇంజినీర్లను ప్రశ్నించారు.   
యూపీ సీఎం యోగికి తప్పిన ప్రమాదం Publish Date: Mar 27, 2025 9:57AM

శాకాహారులు భయపడక్కర్లేదు.. గుడ్లకంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఈ ఆహారాలు తినండి..!

  ఆహారంలో ప్రోటీన్ కు చాలా ప్రత్యేక స్థానం ఉంది.  కండరాల నిర్మాణానికి,  శరీరం బలంగా ఉండటానికి ప్రోటీన్ చాలా అవసరం. అయితే శాకాహారులలో ప్రోటీన్ కు సంబంధించి భయాలు ఎక్కువ ఉంటాయి.  దీనికి కారణం.. ప్రోటీన్ అంటే మాంసాహారం లోనే ఉంటుందని నమ్మడం. చాలా వరకు ప్రోటీన్ కోసం అధిక శాతం మంది గుడ్లు ఎక్కువ తీసుకుంటారు.  కానీ గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన కొన్ని శాఖాహార ఆహారాలు ఉన్నాయి.  మీరు శాఖాహారులు అయి, కండరాలను బలంగా పెంచుకోవాలనుకుంటే, ఈ సూపర్‌ఫుడ్‌లను మీ ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోవద్దు. ఇవి మీ శరీరానికి ఉక్కులాంటి బలాన్ని ఇవ్వడమే కాకుండా కండరాలను నిర్మించడంలో కూడా సహాయపడతాయి.. సోయాబీన్.. సోయాబీన్‌ను శాఖాహార ప్రోటీన్లకు రాజు అంటారు. ఇందులో 100 గ్రాములకు దాదాపు 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్డు కంటే చాలా రెట్లు ఎక్కువ! సోయాబీన్స్‌లో కండరాల నిర్మాణానికి సహాయపడే అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. దీనిని టోఫు, సోయా పాలు లేదా సోయా ముక్కలుగా తినవచ్చు. శనగపప్పు.. మన భారతీయ ఆహారంలో శనగపప్పు ఒక ముఖ్యమైన భాగం. 100 గ్రాముల శనగలల దాదాపు 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అది కాబూలి శనగలు  అయినా లేదా మినప్పప్పు అయినా రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పప్పుధాన్యాలు.. పప్పులు, పెసలు, శనగ,  మినపప్పు వంటి పప్పుధాన్యాలు ప్రోటీన్కు  అద్భుతమైన వనరులు. 100 గ్రాముల పప్పు దినుసులలో దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో ప్రోటీన్ మాత్రమే కాకుండా ఐరన్ మరియు ఫైబర్,  పుష్కలంగా ఉంటాయి. పనీర్.. పనీర్ దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉపయోగించబడుతుంది. 100 గ్రాముల పనీర్ ల  దాదాపు 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. వేరుశనగ.. వేరుశెనగలు చౌకగా ఉండటమే కాకుండా ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల వేరుశెనగలో దాదాపు 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనిని స్నాక్ గా లేదా వేరుశెనగ వెన్న రూపంలో తినవచ్చు.                                    *రూపశ్రీ.
శాకాహారులు భయపడక్కర్లేదు.. గుడ్లకంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఈ ఆహారాలు తినండి..! Publish Date: Mar 27, 2025 9:30AM

భద్రాచలంలో కుప్పకూలిన భవనం.. ఏడుగురు కూలీలు మృతి

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో బుధవారం ఘోర విషాదం సంభవించింది. పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్ లో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవన నిర్మాణ పనులలో ఉన్న కూలీలు శిథిలాలలో చిక్కుకున్నారు. కొందరిని స్థానికులు రక్షించారు. ఇప్పటి వరకూ అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఏడుగురు కూలీలు మరణించారు. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. మృతుల వివరాలు కూడా తెలియరాలేదు.  
భద్రాచలంలో కుప్పకూలిన భవనం.. ఏడుగురు కూలీలు మృతి Publish Date: Mar 26, 2025 5:18PM