Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...క్రెడిట్ కోసం ఉబలాటం.. పలుచనౌతున్న జగన్ ప్రతిష్ఠ!
posted on: Mar 26, 2026 10:30AM

ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు సరికదా.. అప్పటికే ఉన్న పరిశ్రమలను తరిమేసింది. జగన్ హయాంలో ఏపీలో పెట్టుబడులు అన్న మాట ఎత్తడానికే పారిశ్రామిక వేత్తలు భయపడ్డారు. అభివృద్ధి అన్న మాటే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏపీలో ఎక్కడా వినిపించలేదు. ఐదేళ్లు అధికారంలో ఉండి జగన్ సాధించిందేమిటయ్యా అంటే ఎవరైనా సరే జీరో అనే చెబుతారు.
2014 నుంచి 2019 వరకూ ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కొరియాకు చెందిన ఆటోమెబైల్ దిగ్గజ కంపెనీ కియా మోటర్స్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో భారీ పెట్టుబడితో తన కార్ల తయారీ కంపెనీని స్థాపించింది. అప్పట్లో కియాదే దేశంలోకెల్లా అత్యంత భారీ విదేశీ పెట్టుబడి. జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లో కియా జగన్ అస్తవ్యస్థ విధానాలకు విసిగి ఏపీనుంచి తరలిపోవాలని నిర్ణయించుకుందన్న వార్తలు వినిపించాయి. ఒక వైసీపీ ఎంపీ అయితే బహిరంగంగా కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ ను బెదిరించడం కనిపించింది. అయితే కియా విషయంలో ప్రజల నుంచి వైసీపీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో వైసీపీ వెనకడుగు వేసింది. దీంతో కియా రాష్ట్రంలో కొనసాగింది. అయితే కియా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కారణం చంద్రబాబు కాదనీ, ఆ క్రెడిట్ మొత్తం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదనీ వైసీపీ క్లెయిమ్ చేసుకుంది. ఎప్పుడో వైఎస్ రాజశేఖరరెడ్డి రాసిన లేఖ కారణంగానే కియా ఏపీలో పెట్టుబడులు పెట్టిందని జగన్ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన బుగ్గన రాజేంధ్రనాథ్ క్రెడిట్ మొత్తం జగన్ కు కట్టబెట్టేయడానికి ప్రయత్నించారు.
అలాగే.. టీసీఎస్ విశాఖలో బ్రాంచి ఏర్పాటు చేయనున్నదనీ, దీని ద్వారా ప్రత్యక్షంగా పది వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయనీ నారా లోకేష్ ప్రకటించారు.లోకేష్ ఇలా ప్రకటించారో లేదో.. అలా వైసీపీ టీసీఎస్ రాష్ట్రానికి రావడానికి క్రెడిట్ జగన్ దే అంటూ ప్రచారం మొదలెట్టేసింది. ఇందు కోసం కొన్ని పేపర్ కట్టింగులు, వైబ్ సైట్ లింకులను సొంత సామాజిక మాధ్యమంలో సర్క్యులేట్ చేసి జగన్ సర్కార్ ఎప్పుడో 2020లోనే టీసీఎస్ ను విశాఖకు తీసుకువచ్చిందనీ, ఆ ఘనత అంతా జగన్ దే అంటూ భజన చేసుకుంది. వాస్తవానికి జగన్ హయాంలో టీసీఎస్ విశాఖలో తన బ్రాంచ్ ప్రారం భిస్తున్నట్లు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అలాగే అప్పట్లో జగన్ సర్కార్ టీసీఎస్ కు ఇస్తున్న ఇన్సెంటివ్ ల గురించి కానీ, కేటాయిస్తున్న భూమి గురించి కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయితే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే టీసీఎస్ విశాఖలో బ్రాంచిని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనా వెలువడింది. వాస్తవం ఇలా ఉంటే జగన్ మాత్రం విశాఖకు టీసీఎస్ తన క్రెడిట్ అంటూ క్రిడిట్ చోరీకి నానా పాట్లూ పడ్డారు
అలా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. ప్రస్తత తెలుగుదేశం కూటమి సాధిస్తున్న విజయాలనూ, తీసుకువస్తున్న పరిశ్రమలనూ తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేయాలన్న తాపత్రయంలో ఓ జోకర్ స్థాయికి దిగజారి పోతున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
కొద్ది నెలల క్రితం ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఒడిశాకు వెళ్లిపోతోంది.. చంద్రబాబు ఏపీకి వస్తుందంటూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారు అని ఎగతాళి చేసిన జగన్.. ఇప్పుడు అదే ప్లాంట్‌కు రాష్ట్రంలో శంకుస్థాపన జరగడంతో వెంటనే ప్లేట్ ఫిరాయించేశారు. రాష్ట్రానికి అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంటును తీసుకువచ్చింది తానే అంటూ తన భుజాలను తానే చరిచేసుకుంటూ.. స్వోత్కర్షకు దిగారు.
ఇందుకు సంబంధించి ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు చెప్పుకుంటున్న గొప్పలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఆయన మాటల్లోని డొల్ల తనాన్ని మరో సారి ప్రస్ఫుటంగా బయటపెడుతున్నాయి. ఆయన పాత వీడియోలు, ప్రస్తుత వ్యాఖ్యలు కలిపి నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆయన రాజకీయ పరిణితిపై సందేహాలు ముప్పిరిగొనేలా చేస్తున్నాయి.
ఒక్క స్టీల్ ప్లాంట్ ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ విషయంలోనే కాదు.. అనేక అంశాల్లో క్రెడిట్ కోసం జగన్ ఉబలాటం నవ్వుల పాలైంది. అసలాయన మాటలను సొంత పార్టీ నేతలూ, శ్రేణులకు నమ్మకం లేకుండా పోయింది. ప్రతి విషయంలోనూ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం కోసం ఆయన పడుతున్న పాట్లు, చేస్తున్న వాదనలు ఆయన ప్రతిష్ఠను ప్రజలలో చులకన చేస్తున్నాయి.






