ఢిల్లీ బ్లాస్ట్.. బీహార్ ఎలక్షన్స్!

ఢిల్లీలో చాందినీ చౌక్, లాల్ ఖిలా, నయి దిల్లి రైల్వే స్టేషన్ కు అతి దగ్గర గా ,  పార్లమెంట్ కు కూడా పెద్దగా దూరం లేని ప్రాంతం లో కారు లో భారీ పేలుడు పదార్ధాలతో కూడిన ఆత్మహుతి దాడి జరిగింది.  కేంద్ర దర్యాప్తు సంస్థలు తన ప్రాథమిక దర్యాప్తులో ఇదే తేలిందని చెబుతున్నాయి.  

ఇక  బీహార్ లో అత్యంత కీలక మైన  రెండో, చివరి దశ పోలింగ్ జరుగుతోంది.  ఈ రెంటికీ లింక్ లేదు.. డిల్లి లో జరిగిన పేలుడు కేంద్ర ప్రభుత్వాన్ని పెద్ద కుదుపునకు లోను చేసింది.  పహాల్ గావ్ ఘటన జరిగిన తరువాత.. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లు అత్యంత అప్రమత్తత తో పనిచేస్తున్నాయి అన్నది వాస్తవం.  అయినా వాటి నిఘా నీడ ను తప్పించుకొని డిల్లి లో కొన్ని కిలోల పేలుడు మెటీరియల్ ను తెచ్చి పేల్చడాన్ని నిఘావైఫల్యంగానే పరిగణించాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. 

ఇకపోతే బీహార్ ఎన్నికల పై ఈ బ్లాస్ట్ ప్రభావం  ఉంటుందా? అన్నదో ప్రశ్న. సోమవారం  రాత్రి 7.30 నిముషాలకు జరిగిన బ్లాస్ట్ దేశం లో నిముషాల్లో పాకి పోయింది.. దీనికంటే ముందు ఒక  విషయం చెప్పుకోవలసి ఉంటుంది. 1991 లో రాజీవ్ గాంధీ పై మానవ బాంబుదాడి జరిగింది.. ఆ దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. అప్పుడు దేశం లో జనరల్ ఎన్నికలు జరుగుతున్నాయి . దాదాపుగా కాంగ్రెస్ కు స్వంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేని ఎన్నికలు అవి. రాజీవ్ గాంధీ హత్య  అనంతరం   జరిగిన ఫేజ్ లో కాంగ్రెస్ కు మెజారిటీ స్థానాలు వచ్చాయి. రాజీవ్ హత్యకు ముందు  జరిగిన స్థానాల్లో కాంగ్రెస్ కు చాలా చాలా తక్కువ స్థానాలు వచ్చాయి.. ఇక ఇప్పుడు ప్రజెంట్ బీహార్ ఎన్నికలకు వద్దాం..  తెల్లారి రెండోది చివరిది అయిన ఎన్నికల ఫేజ్.. మొదటి ఫేజ్ లో ఎన్ డీ ఏ కూటమికి అనుకూలంగా ఓటింగ్ జరగలేదు అనేది పబ్లిక్ టాక్ గా ఉంది.. రెండో ఫేజ్ పై దాని ప్రభావం పడి ఆర్ జేడి కి ఒక 135 స్థానాలు గ్యారంటీగా వచ్చే పరిస్థితి నెలకొని ఉంది.. ఇప్పటి బ్లాస్ట్ ప్రభావం , దాని టైమింగ్ ఎన్నికల పై పడుతుందా అనేది పోల్ స్టర్స్ ను తొలుస్తున్న ప్రశ్న.

పోలింగ ప్రారంభం కావడానికి కేవలం 12 గంటల ముందు, అదీ దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన పేలుడు ప్రభావం బీహార్ లో రెండో దశ పోలింగ్ పై  పడే అవకాశం కేవలం ఐదుశాతం మాత్రమే ఉంటుందంటున్నారు. ఆ ప్రభావం కూడా పట్టణాలూ, నగరాలకే పరిమితమౌతుందనీ అంటున్నారు. అయితే ఆ ఐదు శాతం ప్రభావమే..  సీట్ల లో భారీ తేడాను తెస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఘటబంధన్ ఆ ప్రభావం ను అడ్డుకోగలిగితే గెలుపు వాకిట్లో బోల్తా పడే పరిస్థితి నుంచి కూటమి బయటపడుతుంది

Online Jyotish
Tone Academy
KidsOne Telugu