Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అత్యాచారం కేసులో 4 ఏళ్ళ బాలుడు, తలలు పట్టుకుంటున్న పోలీసులు
posted on: Nov 24, 2017 2:35PM

ఢిల్లీలో ఎన్నో లైంగిక దాడులు జరిగిన ఘటనలు చూసుంటారు. ఇక నిందితులకు జైలు శిక్షలు కూడా పడ్డాయి. కానీ ఇటీవల ఓ కేసు పోలీసుల ముందుకు వచ్చింది. అది అత్యాచారం కేసు. అయితే ఆ కేసులో ఉన్న నిందితుడిపై కేసు నమోదు చేసినా... ఈ వ్యవహారంలో ఎలా ముందుకు అడుగు వేయాలో అర్దంకాక.. పోలీసులు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. అంత కష్టమైన పరిస్థితి పోలీసులకు ఎందుకు వచ్చిందంటే.. ఆ నిందితుడు ఏదో సెలబ్రిటీనో.. లేక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తో కాదు. ఆ నిందితుడు ఎవరంటే.. ఓ నాలుగేళ్ల బాలుడు. షాకింగ్ గా ఉంది కదా.. వినడానికి అలా ఉన్నా.. ఇది మాత్రం నిజం. ఈ దారుణమైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వ్యవహారం ఏంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.
నాలుగేళ్ల పసిప్రాయం అంటే.. ఆటలు, రైమ్స్, పిల్లలతో సరదాసరదా ఉంటారు పిల్లలు. కానీ ఢిల్లీలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న ఆ చిన్నారిపై నాలుగేళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. ముందు జరిగిన ఘటన గురించి పాప తన తల్లితో చెప్పినా.. ఆమె పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత పాప వెక్కివెక్కి ఏడుస్తూ జరిగిన షాకింగ్ ఘటనను తల్లికి వివరించగా.. ఖంగుతిన్న తల్లి స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. కానీ వారు పట్టించుకోకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించింది. దీంతో విషయం వెలుగుచూసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారి నుంచి వివరాలు సేకరించేందుకు పోలీసులు శిశు సంక్షేమ సంఘాన్ని సంప్రదించారు. మేజిస్ట్రేట్, శిశు సంక్షేమ సంఘానికి ఆ చిన్నారి అన్ని వివరాలను చెప్పిందని, అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నామని నైరుతి ఢిల్లీ డీసీపీ శిభేశ్ సింగ్ తెలిపారు. స్కూలు యాజమాన్యం వైఖరిపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనలో ఇతరుల ప్రమేయంపైనా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. కాగా, చిన్నారికి ద్వారకలోని రాక్‌లాండ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. లైంగిక దాడి నిజమేనని వైద్యులు తేల్చారు. పోలీసులు వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.
అయితే ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే.. బాలునిపై అత్యాచారం క్రింద కేసు నమోదు చేసినప్పటికీ, బాల నిందితుడిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలని పోలీసులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే 7 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై చట్టపరమైన చర్యలు తీసుకోరాదు. అందుకే దానిపై న్యాయ నిపుణులను సంప్రదించాలని పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ప్రాషిక్యూషన్‌కు వ్యతిరేకంగా ఏడు సంవత్సరాలలోపు వయస్సువారికి కొన్ని రక్షణలను కల్పిస్తుందని ఢిల్లీ పోలీసు ప్రతినిధి దీపక్ పాథక్ అన్నారు. ఈ విషయాన్ని అత్యంత సున్నితమైనదిగా పరిగణిస్తున్నామని ఆయన తెలిపారు. ఏది ఏమైనా నాలుగేళ్ల బాలుడు.. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేశాడంటే.. రోజులు ఎలా తయారయ్యాయో అర్ధమవుతుంది. మరి పిల్లలు ఇలా అవ్వడానికి తల్లిదండ్రుల్లో లోపం ఉందా.. లేక స్కూల్లో పర్యావేక్షణ లో లోపం ఉందా.. బోధనల్లో ఎమైనా లోపం ఉందా.. లేక మారుతున్న రోజులను బట్టి ఇలా తయారవుతున్నారా..? ఏదైనా ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు ఇటువంచి దారుణాలకు ఒడిగడుతుంటే.. దీనిలో సమాజం పాత్ర ఎంత ఉంది..


.jpg)



