Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దానం.. కాస్త నిదానం!
posted on: Jan 31, 2014 5:50PM

రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ దానం నాగేందర్ తన దూకుడు తగ్గించుకుని నిదానంగా వుండాల్సిన అవసరం కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గతంలో ఆయన నేపథ్యం ఎలాంటిది అయినప్పటికీ, ఆయన ఎంత దూకుడు కలిగిన వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుతం ఆయన రాష్ట్ర మంత్ర హోదాలో వున్నారు. అందువల్ల ఆ హోదాకి తగ్గట్టుగా వ్యవహరిస్తే పద్ధతిగా వుంటుందని పలువురు భావిస్తున్నారు. కొంతకాలం రాష్ట్ర విభజన వద్దని, మరికొంతకాలం హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని, మరికొంతకాలం హైదరాబాద్‌ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని నినదించిన ఆయన ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతూ వుండటంతో వీర విభజన వాదిలాగా తనను తాను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారు. రాబోయే ఎన్నికలలో అటు సమైక్యవాదులతోపాటు ఇటు విభజనవాదుల ఓట్లు కూడా తన అకౌంట్‌లో వేసుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు.
ఇందులో భాగంగానే రెండు మూడు రోజుల క్రితం తెరాస నాయకుడు కేకే అసెంబ్లీకి వచ్చినప్పుడు దానం గారు ధడేల్‌మని ఆయన కాళ్ళమీద పడిపోయారు. అంత బహిరంగంగా, అంతమంది ప్రజా ప్రతినిధుల మధ్యలో దానం లాంటి మినిస్టర్ తన కాళ్ళమీద బోర్లా పడిపోయినందుకు కేకే ఎంత సంతోషించి వుంటారో, భవిష్యత్తులో తెరాస తరఫు నుంచి దానానికి సహకారం ఎలా దానం చేస్తారో ఎవరైనా ఊహించగలరు. కేకేని కాకాపట్టడంలో దానం ప్రదర్శించిన ప్రతిభా పాటవాలు అందరినీ ముగ్ధులను చేశాయి. కాకా పట్టడం అంటూ జరిగితే ఈ స్థాయిలో పట్టాలని చాలామంది దానం దగ్గర కాకా పాఠం నేర్చుకున్నారు. అయితే దానం అక్కడితే ఆగితే బాగుండేది. కేకే మీద తన అవ్యాజమైన ప్రేమను ప్రదర్శించడం కోసం ఇతరులను బెదిరించే పనులు కూడా దానం గారు చేపట్టారు.
రాజ్యసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకుడు చైతన్యరాజు పోటీలో నిలిచారు. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే చైతన్య రాజు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైతన్యరాజు గెలవటం అంటే, తెరాస తరఫున బరిలో వున్న కేకే ఓడిపోతారని అర్థం. ఈ పాయింట్ దానాన్ని ఖిన్నుడిని చేసినట్టుంది. అందుకే దానం చైతన్యరాజు దగ్గరకి వెళ్ళి మర్యాదగా పోటీ నుంచి విరమించుకోవాలని బెదిరించినట్టు మాట్లాడారు. మంత్రి గారి బెదిరింపులతో చైతన్యరాజు మనసు కష్టపెట్టున్నారు. ఆయన కళ్ళలో నీరు కూడా తిరిగినట్టు తెలుస్తోంది. చైతన్యరాజు దగ్గర దానం వ్యవహారశైలి క్షమార్హంగా లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.






