Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పురంధీశ్వరీకి షాకిచ్చిన ఓటర్....అన్యాయం చేసే పార్టీలతోనే ఎందుకుంటున్నారమ్మా?
posted on: May 5, 2018 3:36PM
.jpg)
త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారడంతో.. పార్టీలన్నీ కలిసి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని తెగ కష్టపడుతున్నారు. దీనిలో భాగంగానే ప్రచార కార్యక్రమాల్లో బిజీ.. బిజీగా పాల్గొంటున్నారు. అంతేకాదు ఈ ప్రచార కార్యక్రమాల్లో మన ఏపీ నేతలు కూడా పాల్గొంటున్నారు. అలా ప్రచార కార్యక్రమానికి వెళ్లిన బీజేపీ నేత పురంధీశ్వరీకి ఓ షాక్ తగిలింది. ఇంతకీ ఆ షాక్ ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. రాయచూరు జిల్లాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పురంధీశ్వరీని ఓ ఓటర్ ఓ ప్రశ్న అడిగాడు... ‘అమ్మా… గత ఎన్నికలలో ఇక్కడకు వచ్చి కాంగ్రెస్ కు ఓటేయమన్నారు… ఇప్పుడు వచ్చి బిజెపికి ఓటేయమంటున్నారు. ఏపీకి అన్యాయం చేసే పార్టీలతోనే ఎప్పుడు ఎందుకుంటున్నారమ్మా?’ అంటూ అవాక్కయ్యే ప్రశ్న వేసాడు. ఇక ఆ ఓటర్ అడిగిన ప్రశ్నకు షాకైన పురంధీశ్వరీ తేరుకొని సమాధానం చెప్పుకున్న ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే మళ్లీ ఆ ఓటరు...‘మాది గుడివాడ, మీ నాన్న గారు పార్టీ స్థాపించినపుడు జెండా మోసా, ఆ అభిమానంతోనే అడుగుతున్నా, వేరొకర్ని అయితే అడిగేవాడ్ని కాదు’ అంటూ మరో చురక అంటించారు. దీంతో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక.. ‘న్యాయం చేసే పార్టీలకే ఓటు వేయాలని, తనది రాజకీయం కాదని’ ఓ ముక్క చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయినట్లుగా సమాచారం. మొత్తానికి బీజేపీ నేతలకు ఒకదాని తరువాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మరి ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఎంత వరకూ విజయం సాధిస్తుందో చూద్దాం...


.jpg)
.jpg)


