Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నారాయణ యూటర్న్... అందుకేనా..!
posted on: Jan 11, 2018 4:47PM

ఎప్పుడూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించే సీపీఐ జాతీయ నేత నారాయణ ఇప్పుడు విచిత్రంగా ఆయనపై పొగడ్తలు కురిపించారు. అమరావతి నిర్మాణాన్ని చూడటానికి నారాయణతో పాటు ఇద్దరు నేతలతో కలిసి వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఆయన.... సైకిల్ పై సచివాలయానికి వచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”చంద్రబాబు ప్లాన్ అద్భుతంగా ఉంది.. రోడ్లు దీర్ఘకాలికంగా మన్నేలా వేస్తున్నారు.. ఆయన ఆలోచనలు బాగున్నాయి కానీ ఆచరణలో ఎంతవరకూ నోచుకుంటాయో అనేది మాత్రం సందేహంగా ఉంది అన్నారు.. అప్పటి వరకూ పొగిడి వెంటనే చురక అంటించారు.
.jpg)
అంతేకాదు కేంద్ర ప్రభుత్వంపై, మోడీపై కూడా విమర్సలు గుప్పించారు.మోడీ పైకి చిరునవ్వుతూనే... ఎపీకి మొండి చెయ్యి చూపిస్తున్నారని.. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని వదిలేసి ఏపీ పై నిందలు వేస్తున్నారు అని అసలు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కాపిటల్ నిర్మిచాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందా లేదా..అలాంటప్పుడు కేంద్రంలో ఎందుకు మీ ప్రభుత్వం అంటూ చాలా ఘాటుగానే విమర్శించారు..దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ సత్తా ఏ పాటిదో మొన్న తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నికల్లోనే తేలిపోయిందన్నారు.కనీసం నోటా కి వచ్చిన ఓట్లు కూడా బీజేపి కి రాలేదు అని ఇప్పటికైనా మీ స్పీడు తగ్గించుకుకోవడం మంచిది అన్నారు..ఒంటరిగా పోరు చేస్తా అంటున్నారు చేయండి అప్పుడు మీ సత్తా ఏమిటో అందరికీ తెలుస్తోంది అని ఎద్దేవా చేశారు.. మరి ఉన్నట్టుండి నారాయణ ఇలా యూటర్న్ తీసుకోవడంపై అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు ఓ కొత్త చర్చ కూడా జరుగుతుంది. వచ్చే ఎన్నికల నేపథ్యంలో టీడీపీతో కలిసి నడిచే ఉద్దేశ్యం ఏదన్నా ఉందా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎప్పుడూ చంద్రబాబును విమర్శించే నారాయణ ఇప్పుడు ఆయనను ప్రశంసించారని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.. నిజంగానే చంద్రబాబు ప్లాన్ నచ్చి నారాయణ పొగిడాడో.. లేదా ఆయన మనసులో ఇంకేదైనా ఆలోచన ఉందో...?


.jpg)
.jpg)


