భార్యాభర్తలు విడిపోవడానికి కారణమయ్యే మిస్టేక్స్ ఇవీ..  మీరు ఈ తప్పులు చేస్తారేమో జాగ్రత్త..!

 


వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలనే చేసుకుంటారు.  కానీ దురదృష్టం కొద్ది పెళ్ళి చేసుకున్న జంటలు అన్నీ కలిసి ఉండటం జరగదు. కుటుంబ కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు, వేరే ఇతర కారణాలు కూడా కావచ్చు.  నేటికాలంలో భార్యాభర్తలు విడిపోవడానికి చాలా రకాలుగా కారణాలు ఉంటున్నాయి. అయితే భార్యాభర్తలు  మాత్రమే చేసే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి.  వీటి వల్ల భార్యాభర్తల బంధం బలహీనపడి విడిపోవడానికి దారి తీస్తుంది. భార్యాభర్తలు విడిపోవడానికి కారణం అయ్యే ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటే.. ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడవచ్చు.  తద్వారా భార్యాభర్తల బంధం పదిలంగా ఉంచుకోవచ్చు.

ఇవి మాట్లాడకూడదు..

భార్యాభర్తలలో ఏవరైనా లేకా ఇద్దరూ అయినా వివాహానికి ముందు వేరే వ్యక్తులను ప్రేమించి ఉండవచ్చు.  కొందరు తమ వివాహం సమయంలో నిజాయితీగా ఉండాలనుకుని తమ గత ప్రేమ విషయాన్ని చెబుతుంటారు.  అయితే వారు నిజాయితీగా తమ ప్రేమ గురించి చెప్పిన తరువాత  మాజీ ప్రియుడు లేదా ప్రియురాలి గురించి  పదే పదే మాట్లాడటం, ఏదైనా సమయం లేదా  సందర్బంలో మాజీ వ్యకులతో పోల్చి అసహనం వ్యక్తం చేయడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే బార్యాభర్తల బంధం దెబ్బతింటుంది. ఎందుకంటే ఎవరూ ఇలా పోలికలు పెట్టి మాట్లాడటం గురించి సహించరు.

చిన్న విషయాలు, గొడవలు..

భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే ఒకరితో మరొకరు గొడవ పెట్టుకుంటే లేదా ఎటువంటి కారణం లేకుండా  కోపాన్ని, అసహనాన్ని చూపిస్తుంటే ఆ బంధం ఎక్కువకాలం నిలవడం కష్టమవుతుంది. అందుకే భార్యాభర్తలు మిగతా సమయాలలో ఎలా ఉన్నా ఒకరి పక్కన ఒకరు ఉన్నప్పుడు ఓపికగా, ప్రశాంతంగా ఉండాలి.

అబద్దాలు..

భార్యాభర్తలు ఒకరితో మరొకరు పదే పదే అబద్ధం చెబితే  సంబంధం బెడిసికొట్టే అవకాశం ఉంది. ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి,  నిజాన్నే మాట్లాడాలి.  ఎప్పుడైనా అబద్దం అనేది చెబితే భాగస్వామిని బాధపెట్టకూడదనే ఉద్దేశంతో చెప్పాలి తప్ప..  మోసం చేసే ఉద్దేశంతో చెప్పకూడదు.  భాగస్వామిని మోసం చేయడం వల్ల భార్యాభర్తల  బంధం ఒక్క క్షణంలో నాశనం అవుతుంది.

తప్పులు, క్షమాపణ..

భార్యాభర్తల మధ్య గొడవలు, వాదనలు వచ్చినట్టే తప్పులు కూడా జరుగుతాయి.  భార్యాభర్తలలో ఎవరైనా సరే.. తప్పు చేస్తే మరొకరు క్షమించడానికి సిద్దంగా ఉండరు. జరిగిన తప్పు గురించి పదే పదే సమయం,  సందర్భం వచ్చిన ప్రతి సారి నిందిస్తూ, తిట్టుకుంటూ ఉంటారు.  కానీ ఇది చాలా కాలం పాటు కొనసాగితే అది  సంబందాన్ని దెబ్బతీస్తుంది. ఇలా గొడవ చేస్తుంటే ఏ లైప్ పార్ట్నర్ కూడా కలిసి ఉండాలని అనుకోరు. ఫలితంగా ఇద్దరూ విడిపోయే అవకాశాలు పెరుగుతాయి. అందుకే  ఏ తప్పును ఎక్కువ కాలం మనసులో పెట్టుకుని ఉండకూడదు.  తప్పు జరగగానే దాని గురించి మాట్లాడుకుని, ఆరోగ్యకర సంభాషణలతో పరిష్కరించుకుని, దాని గురించి వదిలేయాలి.

                             *రూపశ్రీ.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu