Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రజనీకాంత్‌కు సారీ చెప్పిన టీవీకే నేత
posted on: Mar 18, 2026 4:26PM

సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ అదవ్ అర్జున క్షమాపణలు చెప్పి ఆ వివాదానికి తెర దించే ప్రయత్నం చేశారు. తమ నాయకుడు విజయ్‌కే నాయకుడైన సూపర్‌స్టార్‌ని బాధపెట్టాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, ఆ వివాదం చాలా విచారం కలిగించిందని పేర్కొన్నారు. బుధవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అర్జున.. రజనీపై తన వ్యాఖ్యల గురించి స్పందించారు. ఇటీవల అర్జున ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రజనీ రాజకీయ ప్రవేశం చేయాలనుకున్న సమయంలో డీఏంకే నేతలు ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.
అలాంటి ఒత్తిళ్లకు విజయ్ తలొగ్గరని అన్నారు. డీఎంకే బెదిరింపులకు భయపడి రజనీ రాజకీయంగా వెనకడుగు వేశారనిఅర్థం వచ్చేలా, అర్జున చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి . డీఎంకే నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. రజనీ కూడా అర్జున వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టీవీకే ఉన్నతస్థాయి నేత ఒకరు నా మీద చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం. ఈ విషయంలో నేను చెప్పేది ఒకటే.. కాలం సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది' అని ఎక్స్ వేదికగా రజనీకాంత్ స్పందించారు. ఈ నేపధ్యంలో రజనీకాంత్‌ను కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని, అది డీఎంకే కుట్ర అని మాత్రమే తాను చెప్పానని, రజనీ నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చని, ఈ వివాదం తనకు చాలా విచారం కలిగించిందని అదవ్ అర్జున అన్నారు.






