Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉత్తమ్ టార్గెట్‌గా జానా స్కెచ్... తెరపైకి కొత్త ఫార్ములా..!
posted on: May 17, 2017 11:22AM

మళ్లీ అధికారం తమదేనంటూ టీఆర్‌ఎస్ ధీమాగా దూసుకుపోతుంటే... 2019లో పవర్‌లోకి వచ్చేది తామేనంటూ బీరాలు పలుకుతోన్న టీకాంగ్రెస్ నేతలు మాత్రం ఇంటర్నల్ ఫైటింగ్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం గట్టిగానే పనిచేస్తోంది. దాంతో పార్టీ కార్యక్రమాల విషయంలో క్లారిటీ లేకుండా పోతోందని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తమ్ అంటే దిగ్విజయ్‌కి పడటం లేదనే టాక్ కూడా పార్టీలో నడుస్తోంది. దిగ్విజయ్ సింగే... ఉత్తమ్‌కి వ్యతిరేకంగా అధిష్టానానికి రాష్ట్ర నేతలతో పదేపదే ఫిర్యాదులు చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆమధ్య ఉత్తమ్‌పై కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడటం వెనుక కూడా దిగ్విజయ్ హస్తముందనే టాక్ ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే సమూల మార్పులు జరగాలని హైకమాండ్‌పై రాష్ట్ర నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ, సీఎల్పీ సారథ్యం ఒక్కరికే ఇవ్వాలనే వాదన తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. పీసీసీ, సీఎల్పీలకు వేర్వేరు నేతలు సారథ్యం వహిస్తుండటంలో పార్టీలో గ్రూపులు పెరిగిపోయాయని, అదే రెండు పదవులకూ ఒక్కరే నాయకత్వం వహిస్తే... నేతల్లో ఐక్యమత్యం పెరిగే అవకాశముందని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే వాదనను హైకమాండ్ ముందుపెట్టిన సీఎల్పీ నేత జానారెడ్డి.... పీసీసీ పదవిని కూడా తనకే అప్పగించాలని ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ, సీఎల్పీ పదవులు ఒక్కరికే కట్టబెట్టడం ద్వారా పార్టీని లీడ్ చేయడం ఈజీ అవుతుందని, తద్వారా గెలుపు అవకాశాలు పెరుగుతాయని చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఉత్తమ్‌కి వ్యతిరేక వర్గం బలంగా ఉండటంతో... పీసీసీ, సీఎల్పీ పదవులు ఒక్కరికే కట్టబెట్టాలన్న వాదనకి పార్టీలో మద్దతు పెరుగుతోంది.


.jpg)
.jpg)


