Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెస్ ‘తుస్సు’ యాత్ర!
posted on: Mar 24, 2014 5:41PM

సీమాంధ్రలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న యాత్రని ‘బస్సు’ యాత్ర అని పిలవడం కంటే ‘తుస్సు’ యాత్ర అని పిలిస్తే కరెక్ట్ గా సూటవుతుందని విమర్శకులు అంటున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడితో సహా సీమాంధ్ర కాంగ్రెస్‌లోవున్న ముఖాలన్నీ సీమాంధ్ర ప్రజలు చూడ్డానికి కూడా ఇష్టపడని ముఖాలే. వీళ్ళని చూడ్డానికి ఎవరూ రారు కాబట్టి సినీ గ్లామర్ వున్న చిరంజీవిని వెంట పెట్టుకుని బస్సు యాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం సీమాంధ్రలో ఈ బస్సు యాత్ర చప్పచప్పగా సాగుతోంది. ఈమధ్యకాలంలో ఇంత చప్పగా జరుగుతున్న బస్సు యాత్ర మరొకటి లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
రోజూ కొన్ని ఊళ్ళకి వెళ్ళడం, అక్కడ ఓ ప్రెస్ మీట్ లాంటిది పెట్టడం, రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ ఒక్కదానిదే కాదు, అన్ని పార్టీలూ ఓకే అన్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ విభజనకి ఒప్పుకుందని చెప్పిన పాయింటే అరిగిపోయిన రికార్డులాగా చెప్పడం.. ఇదే వరస! ఈ ప్రెస్ మీట్స్ లో చిరంజీవి మాట్లాడుతున్న విధానం చూస్తుంటే ఆయనకు వున్న రాజకీయ అపరిపక్వత స్పష్టంగా కనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ చిరంజీవి మాట్లాడుతున్న మాటలు చిరంజీవి మీద చిరాకు పెంచి, కిరణ్ కుమార్ మీద అభిమానం పెంచేలా వుంటున్నాయి. రాజకీయాల్లో ఇంత దిగజారుడు తనం కూడా వుంటుందా అన్నట్టుగా చిరంజీవి ప్రసంగం సాగుతోందని విమర్శకులు అంటున్నారు.
కాంగ్రెస్ గర్భంలో కలిసిపోయిన పిఆర్పీ పార్టీకి చెందిన ఓ కార్యకర్త అందరిముందు చిరంజీవిని ఛీకొడుతూ ‘పార్టీని అమ్ముకోవడానికి సిగ్గులేదా?’ అని అడిగేయడం, పిఆర్పీ ఐడెంటిటీ కార్డ్ ని ముక్కలు చేసేయడం బాబోయ్ దారుణం. ఇంత జరిగినా చిరంజీవి తుడిచేసుకుని బస్సు యాత్రలో పాల్గొనడం ఇంకా దారుణం. ఇక రోడ్ షోల విషయానికి వస్తే, వాటికి ‘రోడ్ షో’ లాంటి భారీ మాటలను ఉపయోగించడం అనవసరమన్న అభిప్రాయం కలుగుతోంది. సాక్షాతూ చిరంజీవి వచ్చి రోడ్డు మధ్యలో నిలబడినా పట్టుమని వందమంది కూడా జనం రావడం లేదంటే కాంగ్రెస్ పార్టీ జరుపుతున్న బస్సు యాత్ర ఎంత తుస్సుమందో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి కాకుండా యాత్రలో పాల్గొంటున్న మిగతా నాయకులను చూసిన సామన్య జనం ‘వీళ్ళెవరబ్బా.. ఎక్కడా చూసినట్టు లేదే’ అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సు యాత్రకి బ్రేకులేస్తే బెటరన్న అభిప్రాయాలని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.



.jpg)


