Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెస్ ఆత్రపడితే జీ.హెచ్.యం.సి. ఎన్నికలు వస్తాయా?
posted on: Sep 16, 2014 7:57PM
.jpg)
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగనున్న జీ.హెచ్.యం.సి. ఎన్నికలకు సిద్దం అయ్యే ప్రయత్నంలో నిన్న హైదరాబాదులో సమావేశమయ్యి ఆ పరిధిలో స్థిరపడిన సెటిలర్స్ ను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో వారి భద్రతకు తాము భరోసా ఇస్తున్నామంటూ ఏవో చాలా మాటలే చెప్పారు. అయితే జీ.హెచ్.యం.సి. కౌన్సిల్ ప్రస్తుత కాలపరిమితి డిశంబరులో ముగుస్తుంది. ఆ తరువాత జీ.హెచ్.యం.సి. పరిధిలో వార్డులను జనాభా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణ చేసి, ఆయా వార్డులలో బీసీ, యస్సీ, యస్టీ వర్గాలకు కేటాయింపులు చేయవలసి ఉంటుంది. కనుక ఆ ప్రక్రియ అంతా పూర్తీ చేసేవరకు జీ.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని రవాణా శాఖామంత్రి పీ. మహేందర్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా టీ-కాంగ్రెస్ జీ.హెచ్.యం.సి. ఎన్నికలకు అప్పుడే సమర శంఖం పూరించేసారు. అంతేగాక ఈ సారి సెట్టిలర్లను ప్రసన్నం చేసుకొని ఈ ఎన్నికలలో గట్టెక్కాలని ఒక ప్రణాళిక కూడా సిద్దం చేసుకొన్నట్లున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ఎంతగా ఆత్రం పడినప్పటికీ ఇప్పట్లో జీ.హెచ్.యం.సి. ఎన్నికలు జరిగే అవకాశం లేదని మంత్రిగారి ప్రకటన స్పష్టం చేస్తోంది.


.jpg)
.jpg)


