తెలుగువారికి కీలక పదవులు ఇవ్వరా?

మన రాష్ట్రం 33 మంది ఎంపీలను పంపి యపిఎ గవర్నమెంటును నిలపటంతో ప్రముఖ పాత్ర పోషించింది. కాని మంత్రుల విషయంలో మాత్రం వచ్చింది చాలా తక్కువ. తమళనాడు, వెస్ట్‌ బెంగాల్‌, యుపి, మహరాష్ట్ర ఇలా ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా వాళ్లంతా మన కంటె చాలా తక్కువ ఎంపిలనిచ్చి కీలకమైన  పదవులు సంపాదించుకున్నారని తెలుస్తుంది.. ఇంతమంది ఎంపీలను పంపిన మన రాష్ట్రానికి మాత్రం ఉన్నది ఒకే ఒక  క్యాబినెట్‌ మంత్రి మంత్రి, మరో ఐదుగురు సహాయ మంత్రులతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రతి సారీ క్యాబినెట్‌ విస్తరణ విన్నప్పుడు మన రాష్ట్రనాయకులంతా ఢల్లీలో చెక్కర్లు కొట్టటం మామూలైపోయింది.ప్రస్తుతం మన రాష్ట్రంనుండి ప్రాతినిద్యం వహిస్తున్న మంత్రులంతా రెడ్డి, కాపు, కమ్మ, ఎస్‌.సి, ఎస్‌టి కి సంబందితులు.


కాబట్టి ప్రత్యర్ధివర్గమైన తెలుగుదేశం రాబోయేరోజుల్లో బిసిలకు వంద సీట్లు కెటాయింపు జరుగుతుందని ప్రచారం చేస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్‌లోకూడా బిసిలకు ప్రాతినిద్యానికి గాను ఒక మంత్రి పదవి ఇవ్వడం అవసరమని రాష్ట్ర కాంగ్రెస్‌ భావిస్తుంది. కాపు వర్గానికి చెందిన చిరంజీవికి మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని తేలింది . అయితే  సీనియర్‌ తెలంగాణ నాయకుడు విహనుమంత్‌రావుకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని టి.కాంగ్రెస్‌ నేతలు కోరుకుంటున్నారు. హనుమంతరావు అయితేనే రాష్ట్రంలో వైసిపి నాయకుడు జగన్‌ని కూడా సమర్ధవంతంగా ఎదుర్కో గలరని  వారు అనుకుంటున్నారు.

 


అయితే ఇప్పటికే డిల్లీలో మాజీ పిసిసి అద్యక్షుడు డి.శ్రీనివాస్‌, తెలంగాణాకే చెందిన మరి కొంత మంది నాయకులు ఉన్నారు. అంతే కాకుండా సీమాంద్రకు చెందిన కావూరి, రాయపాటికూడా డిల్లీలోనే పైరవీలు జరుపుతున్నారు. రాష్ట్రంలో కేంద్రాన్ని డిమాండ్‌ చేసి పదవులు తెచ్చుకోగలిగిన నేతలు లేనందువల్లే తెలుగువారికి డిల్లీలో సముచిత స్ధానం లభించడంలేదనేది అందరి అభిప్రాయం.