Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీమ్ ఇండియా క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
posted on: Mar 17, 2026 3:57PM

టీమ్ ఇండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన ఆసియా కప్-2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ, మంగళవారం (మంగళవారం (మార్చి 16) సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ సీఎంకు ఒక క్రికెట్ బ్యాట్ బహుమతిగా అందించాడు.
రేవంత్ ఆ బ్యాట్ పట్టుకుని షాట్ లు కొడుతున్నట్లుగా యాక్ట్ చేశారు. కాగా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తిలక్ వర్మను శాలువతో సత్కరించి, మెమెంటో అందజేశారు. రాష్ట్రం నుంచి ఒక యువ క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. టి20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ లోనే కాకుండా టోర్నీ నాకౌట్ స్టేజిలో కూడా కీలక సమయంలో వేగంగా పరుగులు సాధించి తిలక్ వర్మ టీమ్ ఇండియా వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అలాగే టోర్నీ ఆద్యంతం ఫీల్డ్ లో చురుకుగా కదులుతూ కొన్ని అద్భుత క్యాచ్ లు పట్టుకున్నాడు.
అంతకు ముందు ఆసియా కప్ ఫైనల్ పోరులో కూడా టీమ్ ఇండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ ఫైనల్ లో 69 బంతులతో అజేయంగా నిలిచి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు. అదలా ఉంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా తిలక్ వర్మతో పాటు, మరో హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌లను తలా 10 లక్షల రూపాయల నగదు పురస్కారంతో సత్కరించనుంది.






