చంద్రబాబు త్వరగా కోలుకోవాలి.. సీఎం జ‌గ‌న్ రియాక్ష‌న్‌..

చంద్ర‌బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్‌. ఉప్పు-నిప్పు. చంద్ర‌బాబును దెబ్బ‌కొట్ట‌డానికి ఎంత‌టి స్థాయికైనా దిగ‌జారే త‌త్వం జ‌గ‌న్‌ది అని అంటారు. అలాంటి జ‌గ‌న్‌రెడ్డి.. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిసి.. మొద‌టిసారి ఆయ‌న విష‌యంలో పాజిటివ్‌గా స్పందించారు. 

కరోనా బారిన పడిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సీఎం వెల్లడించారు. ‘‘చంద్రబాబు త్వరగా కోలుకొని, ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలి’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. 


Related Segment News