Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
posted on: Mar 26, 2026 9:41PM
.webp)
శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ధర్మానికి, సుశాసనానికి ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు, కర్తవ్యపరాయణుడు శ్రీరాముడు అని ఆయన పేర్కొన్నారు. శ్రీరాముడి అవతార దినం, ఆయన కల్యాణం జరిగిన పుణ్యదినంగా మనం శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటామని సీఎం తెలిపారు.
శ్రీరాముడు ప్రజారంజక పాలనకు ప్రతీక అని, అలాంటి రామరాజ్యాన్ని స్థాపించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. శ్రీరామచంద్రమూర్తి సుగుణాలను ఆచరిస్తూ ప్రతి ఒక్కరూ ఆదర్శ జీవితం గడపాలని, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీరాముడి కృపాకటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు చంద్రబాబు తెలిపారు.



.webp)


