Top Stories

టాక్ ఆఫ్ ద తెలంగాణగా మారిన మీనాక్షి.. సింప్లిసిటీ పాఠాలు నేర్పిస్తున్న నటరాజన్

మీనాక్షి నటరాజన్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణ! గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే మీనాక్షిని.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఏఐసీసీ బాధ్యతలు అప్పజెప్పినప్పుడే.. అంతా అవాక్కయ్యారు. ఇప్పుడు.. ఆవిడ సింప్లిసిటీ చూశాక.. పార్టీ పట్ల ఆమెకున్న కమిట్‌మెంట్ గురించి తెలిశాక.. ఒక్కొక్కరికి మైండ్ బ్లాంక్ అవుతోంది. తెలంగాణలో మనం అధికారంలో ఉన్నాం. పేదల ముఖాల్లో నవ్వులు చూడాలి. అప్పుడే మనం పనిచేసినట్లన్న ఆమె డైలాగ్.. ఇప్పుడు గాంధీ భవన్‌లో రీసౌండ్‌లో వినిపిస్తోంది. సాధారణంగా.. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఇన్ చార్జ్ వస్తున్నారంటే.. హైదరాబాద్ గాంధీ భవన్‌లో హడావుడి మామూలుగా ఉండదు. పార్టీ నేతల హంగామాకు హద్దే ఉండదు. కానీ.. మీనాక్షి నటరాజన్ ఫ్లైట్‌లో కాకుండా.. సాదాసీదాగా ట్రైన్‌లో రావడం చూసి అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. పార్టీలో ఎంతో కీలకమైన స్థానంలో ఉన్నప్పటికీ ఆవిడ.. హంగూ, ఆర్భాటాలకు దూరంగా ఉన్నారు. ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలా.. సింపుల్‌గా భూజానికి ఓ హ్యాండ్ బ్యాగు, వీపున చిన్న లగేజీ బ్యాగ్ వేసుకొని హైదరాబాద్ వచ్చేశారు. స్వాగతాలు, పూల బొకేలు, ఫ్లెక్సీలు, శాలువాలు, సన్మానాల లాంటివి తనకు నచ్చవని.. వాటికి దూరంగా ఉండాలని ముందే పార్టీ నేతలకు సూచించారు. తన బ్యాగ్ కూడా తానే మోసుకొని వచ్చారు. రైల్వే స్టేషన్ నుంచి నేరుగా.. తాను ఆన్‌లైన్‌లో సొంతంగా డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న దిల్ కుశా గెస్ట్ హౌజ్‌ గదిలో దిగారు. అక్కడే బస చేశారు. ఇది.. ఆవిడ సింప్లిసిటీకి మరో ఎగ్జాంపుల్. మీనాక్షి నటరాజన్ బ్రహ్మచారిణి. చాలా సాదా సీదాగా ఉంటారు. ఎమర్జెన్సీ మీటింగులకు, రాహుల్ గాం ధీ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పుడు.. అత్యవసర పిలుపు వస్తే మినహా.. ఆమె ఫ్లైట్ జర్నీ చేయరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయ్. ఆమె వెంట ఎప్పుడూ రెండు జతల బట్టలే ఉంటాయ్. మామూలు భోజనమే చేస్తారు. నాన్‌వెజ్‌కు దూరం. ఎక్కడికెళ్లినా.. ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌లోనే మాజీ ఎంపీ హోదాలో సొంత ఖర్చుతో బస చేస్తారు. కాన్వాయ్ ప్రయాణానికి సైతం దూరంగా ఉంటారు. సాధారణంగా ఆమె ఆటోలో వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తారు. గ్రూప్ మీటింగులు తప్ప.. పర్సనల్ మీటింగులకు ఆవిడ దూరం. అంతేకాదు.. టైమ్ అంటే టైమే. సమయ పాలన కచ్చితంగా పాటిస్తారు. ఇతర గెస్టుల కోసం ఎదురుచూడరు. ఎవరొచ్చినా.. రాకపోయినా.. ఆ సమయానికి మీటింగ్ మొదలు పెట్టేస్తారు. గాంధేయ సిద్ధాంతం ఆచరణలో భాగంగా.. ప్రతి శనివారం మౌన వ్రతం పాటిస్తారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె పెళ్లి కూడా చేసుకోలేదని చెబుతారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీకి చెందిన మీనాక్షి నటరాజన్.. గతంలో  ఎన్ఎస్ యుఐ జాతీయ అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం రాజీవ్‌గాంధీ పంచాయతీ సంఘటన్ జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2 009లో మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ ఎంపీగా ఎన్నికయ్యారు. మీనాక్షి.. అసలు సిసలైన గాంధేయవాది. అందుకే.. గాంధీ ఫ్యామిలీకి ఆమె సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు, తెలంగాణ ఇన్ చార్జిగా వచ్చీ రావడంతోనే.. తన మార్క్ చూపించారు. ఫ్లెక్సీలకు ఫోజులిస్తే కాదు.. ప్రజల్లో ఉంటూ సిన్సియర్‌గా పనిచేయాలని సూచించారు. పైరవీల ఆలోచన.. మైండ్‌లో నుంచి తీసేయాలని హింట్ ఇచ్చారు. గ్రౌండ్ లెవెల్‌లో పని చేసే వారికే.. పదవులు వస్తాయని క్లియర్‌గా చెప్పేశారు. మనిషి సాఫ్ట్‌గా కనిపించినా.. పార్టీ విషయంలో చాలా సీరియస్ అని తెలిసేలా ఫస్ట్ స్పీచ్‌లోనే.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. విభేదాలు, వివాదాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని.. సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తిస్తామన్నారు. మీటింగ్ తర్వాత కూడా మీనాక్షి నటరాజన్.. నేరుగా రైల్వే స్టేషన్‌కి వెళ్లి ఢిల్లీ బయల్దేరిపోయారు. తన కోసం ఎవరూ స్టేషన్‌కు రావొద్దని.. తన బ్యాగులు మోసి ఆత్మగౌరవం కోల్పోవద్దని పీసీసీ సమావేశంలో ఆమె సూచించారు. మీనాక్షి నటరాజన్ నిరాడంబరత చూశాక.. చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆవిడని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
 టాక్ ఆఫ్ ద తెలంగాణగా మారిన మీనాక్షి.. సింప్లిసిటీ పాఠాలు నేర్పిస్తున్న నటరాజన్ Publish Date: Mar 1, 2025 5:04PM

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు?.. బడ్జెట్లో కీలక హామీకి దక్కని చోటు

ఉచిత బస్సు. ఏపీలో కూటమి హామీలలో కీలకమైన వాటిలో ఇదొకటి. ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలవుతున్నా, ఇప్పటివరకు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పధకం ఇంకా అమల్లోకి రాలేదు . దీనిపై మహిళా లోకంలో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో, త్వరలోనే ఆ పధకాన్ని అమల్లోకి తీసుకొస్తామని సర్కార్ అంటోంది. అయితే, తాజా బడ్జెట్ లో కూడా దానికి సంబంధించి ఊసే లేకపోవడంతో... విపక్ష నేతలు విమర్శలతో చెలరేగిపోతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది కూటమి సర్కార్. జనసేన తెలుగుదేశం బిజెపి లను ఏకతాటి మీదకు తీసుకువచ్చి జగన్ కు భారీ షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు అనేక హామీలు ఇచ్చాయి. వాటిలో ఇప్పటికే కొన్ని అమలు చేస్తుండగా... మరికొన్ని ఇంకా మొదలు కాలేదు. అయితే భారీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, కొన్ని పథకాల ఊసు అందులో కనిపించలేదు . దీంతో ఆయా వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా మహిళాలోకం  ఉచిత బస్సు పథకం కోసం ఎప్పటినుంచో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఉచిత బస్సు పథకం హామీ అమల్లోకి రాలేదు . బడ్జెట్లో కూడా దాని గురించి ఊసే ఎత్తకపోవడంతో, అసలు ఆ పథకం ఎప్పుడు అమలు చేస్తారు అన్న సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం త్వరలోనే ఉచిత బస్సు పథకాన్ని అమలులోకి తీసుకొస్తామని చెబుతోంది.  గడచిన తొమ్మిది నెలల కాలంలో, కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చింది. ముఖ్యంగా వివిధ శాఖల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు. అదే విధంగా మిగతా మంత్రులు కూడా వారివారి శాఖల్లో మార్పు తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకున్న కూటమి సర్కార్ .... ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్రంలో పేదరికం నిర్మూలించేందుకు... కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది . అంతేకాదు, కేంద్రం నుంచి కూడా భారీ ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తోంది . అయితే సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి... నెలకు 4000 రూపాయల పింఛన్ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తుండగా... వృద్ధుల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. అయితే ఉచిత బస్సు పథకం కోసం మహిళలు మాత్రం తొమ్మిది నెలల నుంచి ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు. మరి ఆ పథకం ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు గానీ విపక్షం నుంచి మాత్రం అనేక విమర్శలు వసున్నాయి.  కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు పథకం అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. అక్కడ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పధకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు . కానీ, ఏపీలో మాత్రం ఇంకా... మొదలు పెట్టలేదు . తాజా బడ్జెట్ లో కూడా... మహిళలకు ఉచిత బస్సు పధకం ఊసెత్తకపోవడం వారిని నిరాశకు గురిచేసింది.  ఉగాది నుంచి ఉచిత బస్సు పథకం పథకం అమలు చేస్తామని ఆశ చూపి.. తీరా బడ్జెట్‌లో దాని గురించి మాట్లాడలేదు అని వైసీపీ విమర్శలు చేస్తోంది .  అయితే, కర్ణాటక , తెలంగాణాలలో ఉచిత బస్సు పధకం వలన... ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ అక్కడి విపక్షాలు ఆందోళనలు కూడా నిర్వహించాయి.  అయితే,  ఏపీలో ఉచిత బస్సు కంటే.. అర్జెంటుగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చెయ్యడం ముఖ్యం అని కూటమి ప్రభుత్వం భావిస్తోందట . ఎందుకంటే, ఈ రెండు పథకాల ప్రభావం విద్యార్థుల తల్లిదండ్రులపై,  రైతన్నలపై ఉంటుంది. వీటిని త్వరగా ప్రారంభించకపోతే, వారంతా తీవ్ర ఇబ్బందులు పడతారు. ఉచిత బస్సు అర్జెంటుగా ప్రారంభించకపోయినా.. అంత ఇబ్బందేమీ ఉండదు కాబట్టే.. వీటికి నిధులు కేటాయించి, వీటిని ముందు ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచించినట్లు తెలుస్తోంది.  మరి.. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందో కాలమే తేల్చాలి.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు?..  బడ్జెట్లో కీలక హామీకి దక్కని చోటు Publish Date: Mar 1, 2025 4:13PM

గోరంట్ల మాధవ్ కు ఇచ్చి పడేసిన వంగలపూడి అనిత.. పోసానినీ వదల్లేదు!

ఒక వేలుతో ఎదుటి వారిని తప్పు పడితే మూడు వేళ్లు తమ తప్పులను ఎత్తి చూపుతాయని వైసీపీ నేతలు ఎప్పటికి తెలుసుకుంటారో కానీ, అధికారం కోల్పోయిన తరువాత కూడా వారి ధోరణి మారడం లేదు. అధికార కూటమిలో చీలికలు అంటూ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ, వైసీపీ అధికార ప్రతినిథి గోరంట్ల మాధవ్ తెలుగుదేశం కూటమిలో అంతర్యుద్ధం వస్తుందంటూ జోస్యం చెప్పారు. గోరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు పంపిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలకు రాష్ట్ర హోంమంత్రి ఓ రేంజ్ లో రిటార్డ్ ఇచ్చారు. శనివారం (మార్చి 1) మీడియాతో మాట్లాడిన ఆమె కూటమి ఐక్యంగా ఉంది, ఎలాంటి విభేదాలూ లేవని విస్పష్టంగా చెప్పడమే కాకుండా.. ముందు వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా చూసుకోండంటూ హితవు పలికారు.  ఇప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ సర్కార్ కాదు.. తెలుగుదేశం కూటమి సర్కార్.. గతంలోలా ఇష్టారీతిగా, నోటికి వచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదని హెచ్చరించారు.  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించే ప్రశ్నేలేదన్నారు.  ఇక రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ నేతలు మాట్లాడటంపైనా వంగలపూడి అనిత మండి పడ్డారు. నిజంగా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ ప్రకారం ముందుకు వెడితే రోడ్డు మీద వైసీపీ నేత అనేవాడెవరూ తిరగలేరన్నారు.  పోసాని అరెస్టు విషయంలో స్పందిస్తూ ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం కక్ష పూరిత రాజకీయాలు చేయడం లేదనీ, అదే సమయంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రశక్తి కూడా లేదనీ వంగలపూడి అనిత విస్ఫష్టంగా చెప్పారు. ఎవరైనా, ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పించుకోలేరని హెచ్చరించారు. పోసాని కృష్ణ మురళికి స్క్రిప్ట్ సజ్జల రాసి ఇచ్చానా ‘రాజా’ శిక్ష అనుభవించాల్సిందే అన్నారు.   ఇలా ఉండగా కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం అంటూ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం, జనసేనలు అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశాయి. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టి ఆమె గోప్యతకు భంగం కలిగించిన కేసులో విచారణకు రావాలంటూ గోరంట్ల మాధవ్ కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా గోరంట్ల చేసిన వ్యాఖ్యలు ఆయనను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టినట్లుగా కనిపిస్తోంది.    
గోరంట్ల మాధవ్ కు ఇచ్చి పడేసిన వంగలపూడి అనిత.. పోసానినీ వదల్లేదు! Publish Date: Mar 1, 2025 3:44PM

రేవంత్ వర్సెస్ కిషన్.. అసలు కథ ఇదా ?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శత్రువులూ ఉండరు.  శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి, ఇది ఎప్పటి  నుంచో  రాజకీయుల నాలుకలపై నానుతున్న నానుడి. నిజం కూడా. కావాలంటే అందుకు కోకొల్లలుగా ఉదాహరణలు దొరుకుతాయి. ఎవరి దాకానో ఎందుకు, మనం ఇప్పడు మాట్లాడుకుంటున్నతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయమే తీసుకుంటే, ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గడపలు ఎక్కి దిగారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలలో,ఆయన పాదం మోపని పార్టీ లేదు. బీజేపీతో ప్రత్యక్ష అనుబంధం లేక పోయినా, ఆర్ఎస్ఎస్ అనుబంధంతోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది అంతే కాదు..  ఇప్పటికీ ఆయన పాత వాసనలను పూర్తిగా వదులుకోలేదు. ఈ మధ్య కాలంలోనే ఒకటి రెండు సందర్భాలలో ఆయన బహిరంగ వేదిక నుంచి, సాగర్జీ (మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర రావు), బండారు దత్తాత్రేయ ( హిమాచల్ ప్రదేశ్ గవర్నర్) వంటి బీజేపీ పాత తరం నేతలతో పాటు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ వంటి ఈ తరం బీజేపీ నేతలతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.  ఇప్పడు, ఆ అనుబంధమే ఆయన కుర్చీకి ఎసరు తెస్తోందా, అంటే, చివరికి ఏమి జరుగుతుందో ఏమో కానీ, పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు, ఆయన రాజకీయ మూలాలను అస్త్రంగా చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు. ముఖ్యంగా, కర్ణాటకలో డీకే శివకుమార్ బీజేపీ,సంఘ్ పరివార్ కు దగ్గరవుతున్నారనే అనుమానం’తో ఆయన ప్రత్యర్ధి వర్గం, ఆయన కాషాయం కట్టేస్తారనే ప్రచారం సాగిస్తోంది. ఆ విధంగా, ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపి కొడుకును ప్రమోట్ చేసుకునేందుకు తొందరపడుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో    పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతులు కలిపారని అంటున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం, కర్నాటక ఫార్ములాను ఫాలో అవుతున్నట్లుతెలుస్తోంది. అందులో  భాగంగా రేవంత్ రెడ్డికి పూర్వాశ్రమంలో సంఘ్ పరివార్ సంస్థలతో ఉన్న సంబంధాలను వెలికి తీసి, దెబ్బ కొట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఈ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకే  ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా బీజేపీపై, ముఖ్యంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలతో విరుచుకు పడుతున్నారని అంటున్నారు.  అయితే  రేవంత్ రెడ్డిని అడ్డుకునేందుకు, ఆయన ముఖ్యమంత్రి కాక ముందు నుంచీ పార్టీలోని ప్రత్యర్ధులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నిజానికి, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే పార్టీలో వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. అప్పటి నుంచే  రేవంత్ రెడ్డి కుర్చీకి సెగ తగులుతూ వుంది. అందుకే అప్పట్లో రేవంత్ రెడ్డి సీఎం సీట్లో ఎంత కాలం ఉంటారనే  విషయంలో అనేక ఊహాగానాలు వినిపించాయి. నిజానికి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తల్లోనే రేవంత్ రెడ్డి  ఐదేళ్ళు ముఖ్యంత్రిగా ఉంటానని చెప్పే  సాహసం చేయలేదు. ఎంతకాలం ఉంటే అంతకాలం ప్రజలకు మేలు చేస్తానని మాత్రమే చెప్పారు. అందరి ఊహాగానాలను తల్లకిందులు చేస్తూ రేవంత్ రెడ్డి, వన్ ఇయర్ మైలు రాయిని దాటేశారు. ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. కానీ మరో వంక  ఆయన్ని కుర్చీ దింపే ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇలా కుర్చీకి ముప్పు వచ్చిన ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి  రాజకీయ చతురతతో ప్రత్యర్ధులను చిత్తు చేస్తున్నారు. ఇతర చిన్నా చితకా ప్రయత్నాల విషయం పక్కన పెడితే.. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు  రేవంత్ రెడ్డి బిగ్ బ్లో ఎదుర్కొన్నారని  రాజకీయ వర్గాల్లో అప్పట్లోనే కొంత చర్చ జరిగింది. అప్పట్లో  రేవంత్ రెడ్డి  ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్య నాయకులతో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో ఉన్న పూర్వాశ్రమ సంబంధాలను ఉపయోగించుకుని బయట పడ్డారని అంటారు.   అవును. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా నెలల పాటు అటూ ఇటూ ఊగి చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ, బడా కాంట్రాక్టర్ ఒకరు  మొదటి నుంచి ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేశారు. సదరు నాయకుడు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీతో నేరుగా ‘డీల్’ సెట్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇందుకు సంబంధించి ముందుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప్పు అందడంతో జాగ్రత్త పడ్డారు. ఎన్డీఏ ముఖ్య’ నాయకులతో తనకు ఉన్న వ్యక్తిగత పుర్వాశ్రమ సంబంధాలను ఉపయోగించుకుని చక్రం తిప్పారని అప్పట్లో గుసగుసలు వినిపిచాయి. అందుకు తగ్గట్టుగానే  ఆ తర్వాత సదరు మాజీ ఎంపీ  ఇల్లు వాకిళ్ళు, కార్యాలయాల పై ఏక కాలంలో సీబీఐ, ఈడీ దాడులు నిర్వహించాయి. ఈ దాడులకు సంబంధించి అధికారిక సమాచారం లేక పోయినా, పెద్ద మొత్తంలో సొమ్ములు పట్టుబడ్డట్టు వార్తలొచ్చాయి.దీంతో  ఢిల్లీతో కుదుర్చుకున్నడీల్ మెటీరలైజ్  కాలేదని, ఆ విధంగా రేవంత్ రెడ్డికి ఎక్స్టెన్షన్  వచ్చిందని రాజకీయ వర్గాల్లో అప్పట్లో గుసగుసలు వినిపించాయి.  ఇక ఇప్పడు ప్రస్తుతానికి వస్తే  ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా బీజేపీపై ముఖ్యంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలతో విరుచుకు పడడం వెనక కూడా తన కుర్చీని కాపాడుకునే వ్యూహం ఉందని అంటున్నారు.  అయితే, ఈసారి ‘కిస్సా కుర్సీకా’ లో .. ఎవరు గెలుస్తారో?
రేవంత్ వర్సెస్ కిషన్.. అసలు కథ ఇదా ? Publish Date: Mar 1, 2025 3:23PM