Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్-II
posted on: Jun 25, 2016 4:02PM
.jpg)
ఎన్నటికి సాకారం కాదనుకున్న ప్రత్యేక రాష్ట్రం సాధించి..తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఉద్యమ పార్టీ టీఆర్ఎస్. తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో తనకు పోటీ ఇస్తారనుకున్న వారందరిని..ఆనవాళ్లు కూడా లేకుండా చేసే పనిలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీశారు సీఎం. ఇప్పటికే ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యి టీడీపీ, వైసీపీలు కనుమరుగయ్యాయి. ఈ రెండు పార్టీలు సైడవ్వడంతో తన నెక్ట్స్ ఫోకస్‌ని కాంగ్రెస్ పార్టీ మీద పెట్టారు కేసీఆర్. నిన్నటికి నిన్న కంచుకోట లాంటి నల్గొండ జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్‌తో కోలుకోలేని దెబ్బ కొట్టారు. నల్గొండ పార్లమెంట్ సభ్యుడితో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అన్ని పార్టీల్లో మిగిలిపోయిన వారిని కూడా కారెక్కించుకుని ఆపరేషన్ ఆకర్ష్‌ను పరిపూర్ణం చేయాలని కేసీఆర్ స్కెచ్ గీస్తున్నారు.
ఇప్పటి వరకు అగ్రశ్రేణి నాయకత్వాన్నే టార్గెట్ చేసిన గులాబీ బాస్, క్యాడర్‌ను కూడా కారెక్కించాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్‌లో చేరిన వారికి సముచిత గౌరవం దక్కుతుండటంతో పాటు సమీప కాలంలో టీఆర్ఎస్‌ను తట్టుకుని మరో పార్టీ నిలబడే పరిస్థితి కనిపించక పోవడంతో చోటా, మోటా నాయకులతో పాటు క్యాడర్ తమ రాజకీయ భవిష్యత్ కోసం గులాబీ గూటికి చేరాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తోంది.
మొదటి దశ ఆపరేషన్ ఆకర్ష్‌కు కేసీఆర్ నాయకత్వం వహించగా..రెండోవిడత ఆకర్ష్‌కు సీఎం కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత సారథ్యం వహించనున్నారు. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లా నుంచే రెండో విడత ఆకర్ష్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించిన డీఎస్ టీఆర్ఎస్‌లో చేరిన వెంటనే క్యాబినెట్ పదవిని పోందారు ఆ వెంటనే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం పొందారు. ఈ నేపథ్యంలో మిగిలిన నేతల చూపు గులాబీ పార్టీపై మళ్లిందని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో పాటు టీడీపీకి చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తదితరులు ఏ క్షణంలోనైనా కారు ఎక్కెందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


.jpg)



