Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
posted on: Mar 26, 2026 9:49AM

ఉమ్మడి ప్రకాశం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది సజీవదహనం కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలు, సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై ఆరాతీశారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
జగన్ సంతాపం
టిప్పర్ , ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పది మంది ప్రయాణీకులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని వైయస్ జగన్ అన్నారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు న్ని విధాలా సహాయం అందించాలని కోరారు.



.webp)


