Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చిదంబరం తొక్కలో వేదాంతం!
posted on: Mar 24, 2014 12:36PM
.jpg)
బోలెడన్ని జీవాలని పొట్టన పెట్టుకున్న ముసలిపులి శాంతిసూత్రాలు వల్లిస్తే ఎలా వుంటుందో, దేశం నాశనం కావడంలో భాగస్వామి, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం కావడంలో సూత్రధారి అయిన చిదంబరం ఇప్పుడు వేదంతం మాట్లాడుతూ వుండటం కూడా అలాగే వుంటుంది. జీవితంలో అన్నీ అనుభవించేసి, తన సొంత రాష్ట్రం తమిళనాడుకు పోటీగా వున్న ఆంధ్రప్రదేశ్‌ని ముక్కలు చేసే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చిన చిదంబరం లేటెస్ట్ గా తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న తమిళనాడులోని శివగంగా లోక్‌సభ స్థానం నుంచి ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని చెప్పాడు. అంత గొప్ప డెసిషన్ తీసుకున్నావేంటి బాబయ్యా అని ప్రశ్నిస్తే చిదంబరం వేదాంత ధోరణిలో సమాధానాలు చెప్పాడు. జీవితంలో అన్నీ చూసేశాను. ఇప్పుడు నాకు 68 ఏళ్ళు వచ్చేశాయి. నేనిక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండదలుచుకోవడం లేదు. ఇక శాంతిమార్గంలో నడుస్తూ శేష జీవితాన్ని నెట్టేస్తానని చెప్పుకొచ్చాడు. తనకి పునర్జన్మల మీద నమ్మకం లేదని, ఈ జన్మలో ఏం సాధించామన్నదే తనకి ముఖ్యమని చెప్పుకొచ్చాడు. అయ్యగారిలో తొక్కలో వేదాంతానికేం తక్కువలేదు. తాను ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదన్న విషయాన్ని నొక్కి చెబుతూ, యువతరానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే శివగంగ స్థానం నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఇంతకీ వచ్చే ఎన్నికలలో శివగంగ స్థానం నుంచి పోటీ చేయబోతున్న యువతరంగం మరెవరో కాదు.. చిదంబరం గారి పుత్రరత్నం కార్తి. తన కొడుకు కోసం ఎన్నికల నుంచి తప్పుకుంటున్న చిదంబరం అదేదో తాను దేశాన్ని ఉద్ధరించడానికి చేసిన పనిలా బిల్డప్పు ఇచ్చుకుంటున్నాడు. ఇలాంటి తెలివితేటలనే తమిళ సాంబార్ తెలివితేటలు అంటారేమో!


.jpg)
.jpg)


