Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చికెన్ వ్యాపారుల నిరసన.. ఎల్బీనగర్‌లో ఉద్రిక్తత
posted on: Apr 1, 2026 12:25PM
.webp)
హైదరాబాద్‌లో చికెన్ వ్యాపారులు నిరసన బాట పట్టారు. లాభాలు లేకపో వడం, పెరుగుతున్న ఖర్చులు, అప్పుల భారం పెరగడం కారణంగా చికెన్ దుకాణాల నిరవధిక బంద్ కు పిలుపునిచ్చిన వ్యాపారులు ఈ మేరకు దుకాణాల ముందు బ్యానర్లు ఏర్పాటు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల మేత ధరలు, రవాణా ఖర్చులు, కార్మిక వ్యయం పెరగడం వల్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు. ఈ పరిస్థితు ల్లో చాలా మంది చికెన్ వ్యాపారులు అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యం లోనే ఏప్రిల్ 1, 2026 నుంచి తమ దుకాణాలను తాత్కా లికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యా ప్తంగా ఈరోజు ఉదయం నుండి చికెన్ సెంటర్ల బంద్ కొనసాగు తోంది. కాగా ఎల్బీనగర్‌లోని ఓ చికెన్ అవుట్‌లెట్ యజమాని షాప్ తెరిచి విక్రయాలు సాగిస్తున్న విషయం తెలుసుకున్న చికెన్ దుకాణాల అసోసియేషన్ సభ్యులు అక్కడకు చేరుకుని రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతున్నది షాప్ మూసేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆ షాప్ యజమాని వారితో వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆ పాష్ లో ఉన్న కోడిగుడ్ల ట్రేలను అసోసియేషన్ సభ్యులు బయటకు విసిరేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోనికి తీసుకువచ్చారు.


.webp)



