Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పెట్టుబడుల ఆకర్షణే బాబు ఎజెండా
posted on: Nov 6, 2014 1:29PM
.jpg)
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది. అయితే ఈ ఢిల్లీ టూర్ మెయిన్ ఎజెండా పెట్టుబడుల ఆకర్షణేనని ప్రచారం జరుగుతోంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులను తీసుకొచ్చే దిశగా బాబు ఢిల్లీ టూర్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఏపీకి పెట్టుబడుల వెల్లువను తీసుకురావడానికి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న అవకాశాన్ని ఆయన జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రతిచోట నుంచి ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారాయన. ఏపీని సాధ్యమైనంత త్వరగా డెవలప్ చేసి తన శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి అనుక్షణం తపిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆయన బాగా సఫలమయ్యారు కూడా. అయినా ఏ కోశాన ఆయన రిలాక్స్ మూడ్ లో కనిపించడం లేదు.
దేశం గర్వించేలా ఏపీని డెవలప్ చేయాలని కంకణం కట్టుకున్నారు. బాబు కష్టపడుతున్న తీరుకు ప్రధాని మోడీ కూడా అబ్బురపడుతున్నారట. అందుకే బాబు ఏ సాయం కావాలని కోరినా... ఇవ్వడానికి ఓకే చెప్పేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి సీఎం ఏపీకి ఉండడం నిజంగా ఎంతో అభినందనీయమని కేంద్రమంత్రులతో చెబుతున్నారట మోడీ.


(2).jpg)
.jpg)


