Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గ్లామర్ ప్రపంచం… బూతుల గ్రామర్!
posted on: May 23, 2017 4:33PM

సినిమా వాళ్లు ఏ కామెంట్ చేసినా జనానికి ఆసక్తే! ఇక వాళ్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే? మీడియాకి, సోషల్ మీడియాకి పండగే! అందులోనూ ఒక నటుడు వివాదస్పద వల్గర్ మాటలు మాట్లాడితే? కలకలం బయలుదేరుతుంది! కాశ్మీర్ గురించి, సైనికుల గురించి, రాముడి గురించి, రామాయణం గురించి… ఇలా ఎన్ని రకాల అంశాల మీద ఎవరు ఎంత దిగజారుడు వ్యాఖ్యలు చేసినా రాని రియాక్షన్ సినిమా వాళ్ల వల్గర్ కామెంట్స్ కి వస్తూ వుంటాయి. ఆ టాపిక్కే అలాంటిది. పోనీ… సినిమా వాళ్లు చేసే చులకన కామెంట్లని పట్టించుకోకుండా వుందామా అన్నా అదీ సాధ్యం కాదు. ఎందుకంటే, వాళ్లకు ఇదే పరిపాటి అయిపోతోంది కాబట్టి!
రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చలపతి రావు దారుణంగా మాట్లాడాడు. ఆయన వ్యాఖ్యల్ని వేరే ఎవరో కాదు… ఆయనే స్వయంగా సమర్థించుకోలేకపోయాడు. తాను చేసింది తప్పని మీడియా ముందు ఒప్పుకుని సారీ చెప్పేశాడు. కానీ, మహిళా సంఘాలు ఎంత మాత్రం వెనక్కి తగ్గటం లేదు. క్షమాపణలు ఎవరికి కావాలి… జైలుకి వెళుదువుగాని… అంటున్నారు. వాళ్ల కోపానికి కూడా ఒక అర్థం వుంది. గతంలో ఇదే చలపతి రావు ఒక మీడియా ఛానల్ కెమెరా ముందు రేపుల గురించి గొప్పగా చెప్పుకున్నాడు. అసలు సినిమా వాళ్లలో కొందరికి ఎందుకీ నోటి పూత? సమాధానం ఇండస్ట్రీలోని కల్చర్ లో దొరుకుతుంది!
ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా సినిమా రంగంలో చాలా మంది ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. కెమెరా ముందు వాళ్లు మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగ్ లకు వంద రెట్లు ఎక్కువ బూతులు అలా యథాలాపంగా వదిలేస్తుంటారు. అందరూ అలాంటి అరాచకులేనా అంటే కాదనేదే సమాధానం. కానీ, కొందరు మాత్రం డైలాగ్ పర్వర్ట్స్ వుంటారు. వాళ్లు ఎప్పటికీ మారరు. వాళ్లు మారాల్సిన అవసరం ఇండస్ట్రీలో వుండదు కూడా. ఇష్టం వున్నా లేకున్నా ఇండస్ట్రీలోని స్త్రీలు అవసరం కొద్దీ, అవకశం కొద్దీ సర్దుకుపోతుంటారు. అయితే, ఇలాంటి బూతు వ్యవహారాలు అన్ని రంగాల్లోనూ వుంటాయి. అక్కడా స్త్రీలు చాలా సార్లు చూసీ చూడనట్టు వదిలేస్తుంటారు. కాని, సినిమా వాళ్లకుండే గ్లామర్ వల్ల అవ్వి అప్పుడప్పుడూ ఇలా వివాదాస్పదం అవుతూ వుంటాయి.
చలపతి రావులా ఏదంటే అది మాట్లాడే ప్రబుద్ధులు సినిమా రంగంలో చాలా మంది. కాని, వాళ్లలో చాలా మ్యాగ్జిమమ్ శాల్తీలు కెమెరా ముందుకు రాగానే సర్దుకుంటారు. జాగ్రత్తగా మాట్లాడతారు. అయినా కూడా అప్పుడప్పుడూ అలవాటులో పొరపాటుగా నోరు జారటం అనివార్యమే! అది వాళ్లకో బలహీనత! చలపతి రావు లాగా గతంలో ఒక అగ్ర హీరో ఇలాగే వేదికపై స్త్రీలకు కడుపు చేయాలంటూ ఉచిత సలహా విసిరేశాడు! ఆయనకున్న స్టేచర్ కి, స్టేటస్ కి ఇప్పుడైనంత గొడవ కాలేదని భావించుకోవాలి. అలాగే, మన డిఫరెంట్ డైరెక్టర్ కూడా ఒకాయన ఈ మధ్య ట్విట్టర్ లో సన్నీ లియోన్ మీద తన వ్యామోహం సరిగ్గా వుమన్స్ డే నాడు వెళ్లగక్కాడు. స్త్రీలందరూ సన్నీ లియోన్ లా మగవాళ్లకు ప్లెషర్ ఇవ్వాలంటూ ఏదేదో చెప్పేశాడు! ఇక ఆలీ గురించి చెప్పేదేముంది? ఆయన ముందుకు కెమెరా, మైక్ వస్తే ఎవరు బలైపోతారో తెలియనే తెలియదు! హీరోయిన్స్ మొదలు షో నిర్వహిస్తోన్న యాంకర్ వరకూ ఎవ్వరైనా సిగ్గుతో చచ్చిపోవాల్సిందే! అంత సుకుమారంగా చెలరేగిపోతాడు…
ఇంతకీ చలపతి రావుకి శిక్ష పడుతుందా? జైలుకి వెళతాడా? మన భారతీయ న్యాయవ్యవస్థలో కేసులు తేలి శిక్షలు పడాలంటే ఎంత తేలికో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి చలపతి రావు విషయంలో ఇప్పుడప్పుడే బ్రేకింగ్ న్యూస్ లు ఏం మనం వినే ఛాన్స్ లేదు. అయితే, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పడం ఒక్కటే కొంత నయం. కాని, ఇక ముందైనా సినిమా వాళ్లు తమకున్న గ్లామర్, ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని బహిరంగంగా బూతులు మాట్లాడకపోతే బెటర్. టీవీ షోల్లోనూ, సినిమాల్లోనూ కూడా బూతులు వుండకూడదని మనం ఆశించటమైతే … అత్యాశే అవుతుంది!


.jpg)



