పేరు మార్పుపై జగన్ కు మరో ఎదురుదెబ్బ.. 

ప్రభుత్వ పథకాలకు, విమానాశ్రయాలు, క్రీడా మైదానాలు, పార్కులు, ఇతరత్రా ప్రభుత్వ సంస్థలకు అధికార పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం,అనాదిగా వస్తున్న ఆచారమే.అయితే, ఆంధ్ర ప్రదేశ్'లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రయోజిత పథకాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, లేదా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు తగిలించి. సొంత పథకాలుగా ప్రచారం చేయడం ఎక్కువైంది.

అయినా కేంద్ర ప్రభుత్వంపై అంత దృష్టి పెట్టలేదు. కానీ, ఇందుకు సంబంధించి వైసీపీ ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాష్ట్రాలు మీకు నచ్చిన పేర్లు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలకు ఏపీలో జగనన్న గోరుముద్ద, జగనన్న పాలవెల్లువ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పేర్లు పెట్టడం సరికాదని కేంద్ర మాతృక. కేంద్ర ప్రయోజిత పథకాలకు జగన్ పేరు పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక అందించడానికి. ఎంపీ రఘురామ రాసిన సమాధానం చెప్పాలని, ఈ లేఖ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆమె పేర్కొన్నారు.

తాజాగా, కేంద్రం ప్రభుత్వం, 'ఐఐటీ తిరుపతి పేరును వైఎస్సార్ ఐఐటీ తిరుపతిగా మార్చేందుకు, జగన్ రెడ్డి ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిప్పి కొట్టింది. ఇందుకు సంబంధించి , వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌ ఐఐటీ తిరుపతి పేరును వైఎస్సార్‌ ఐఐటీ తిరుపతిగా మార్చే దిశగా కేంద్రం ఆలోచిస్తోందా?' అని అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ సహాయక సుభాష్ సర్కార్. లాంటిది ఏమీ లేదని తేల్చి చెప్పారు.