ఎమ్మెల్యేకు షాకిచ్చిన చంద్రబాబు.. ఆ రకంగా కోపం తీర్చుకున్నారా..?

 

తెలంగాణ టీడీపీ నుండి సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సాయన్న తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. అయితే సాయన్న విషయంలో ఇప్పుడు చంద్రబాబు తన కోపాన్ని తీర్చుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) పాలక మండలి కాలపరిమితిని అందరికి ఏడాది పాటు పెంచిన చంద్రబాబు సాయన్నకు మాత్రం హ్యాండిచ్చారు. వివరాల ప్రకారం.. తితిదే పాలక మండలిలో ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో పాటు.. బోర్డులోని 19 మంది సభ్యులు ఉండగా వారిలో తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. సాయన్నలు కూడా ఉన్నారు. అయితే వీరి కాలపరిమితిని ఏడాది పాటు పెంచిన చంద్రబాబు.. తితిదే బోర్డులో సాయన్న సభ్యత్వాన్ని మాత్రం పొడగించలేదు. అంతేకాదు ఆయన స్థానంలో మరొకరికి స్థానం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారంట.