చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్...7 గురు నక్సలైట్లు దుర్మరణం 

చత్తీస్ గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా నక్సలైట్లు కాల్పులు జరిపారు. పోలీసులు  ప్రతి కాల్పులు జరిపితే ఏడుగురు నక్సలైట్లు చనిపోయారు.   చత్తీస్గడ్లో గత జనవరి నుంచి ఇప్పటివరకు 200 మంది నక్సలైట్లు చనిపోయారు. నారాయణపూర్  దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. చత్తీస్ గడ్ లో మావోయిస్టుల రిక్రూట్ మెంట్ తగ్గింది. ఎన్ కౌంటర్ల ద్వారా నక్సలైట్లను మట్టు పెడితే రిక్రూట్ మెంట్ తగ్గిపోతుందని పరిశీలకులు అంటున్నారు. దాదాపు నాలుగు గంటలకు పైగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. 
Publish Date: Oct 4, 2024 7:26PM

కష్టపడినప్పటికీ సంపన్నులు ఎందుకు కాలేకపోతున్నారు? 

జబ్జార్ భాయ్ బ్యాంకు ఉద్యోగిగా రిటైరయ్యారు. పెన్షన్ తప్పితే మరో ఆదాయ మార్గం లేకపోవడంతో నిరాశ, నిస్పృహ ఆవహించింది. నెలకు లక్ష రూపాయల జీతం రాకపోవడమే ఆయన నిస్పృహకు కారణమైంది.  ఒక రోజు మౌలానా తారసపడ్డాడు.  మౌలానా:  జబ్జార్ భాయ్ మునుపటి మాదిరిగా ఉత్సాహంగా లేకపోవడాన్ని మౌలానా పసిగట్టారు. ఏమయ్యింది , జబ్బార్ భాయ్ అలా ఉన్నావు అని అడిగాడు.   జబ్బార్ భాయ్: సలాం వాలేకుం మౌలానాసాబ్. నేను 40 ఏళ్లు ఉద్యోగం చేసి రెండు ఇళ్లు , పిల్లల పెళ్లిళ్లు చేశాను. ఇటీవల రిటైరయ్యాను. పిల్లలకు గవర్నమెంట్ జాబ్ రాలేదు. సంపాదించే నేను రిటైరయ్యాను. పెన్షన్ తప్పితే మరో మార్గం లేదు. మనవడు, మనవరాళ్లను ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివించాలంటే డబ్బు లేదు మౌలానా సాబ్  మౌలానా: నేను ఇస్లాం అమలుకు సంబంధించి వేలాది తక్రీర్ ( ప్రవచనం)లు  ఇచ్చాను. వాటిని అమలు చేసే వారు కరువయ్యారు. ఏడెనిమిది ఏళ్ల క్రితం నేను ఇచ్చిన తక్రీర్ లను మనుషులు అమలు చేసే వారు. ఇప్పుడలా లేదు. డబ్బు ఎక్కువైతే  చాలామంది బుర్ర చెడిపోతుంది. డబ్బున్నవాడు పేదవాడిని అవమానపరుస్తాడు. అహంకారం ఎక్కువైతే మనుషులను వేధించడం ప్రారంభిస్తారు. బేవకూఫ్ హై, పాగల్ హై అని నానా బూతులు తిడుతుంటారు. రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నా పేదవాడు తరతరాలుగా అవమానానికి గురవుతున్నాడు. సమాజంలో ట్రెండ్ నడుస్తుంది. ఖురాన్ మీద విశ్వాసం లేకపోవడమే మనిషి నిరాశకు ప్రధాన కారణం. లాయ్ లా ఇల్లాల్లా మహమ్మదుర్ రసూలుల్లా అని అరబ్బీలో మహమ్మద్ ప్రవక్త ప్రవచించారు. అల్లా తప్పితే మరో దేవుడు సృష్టిలో లేడని ప్రవక్త సందేశం ఇచ్చాడు. అల్లా మీద నమ్మకం లేనివారు ఇలా డిప్రెస్ అవుతారు. సంపద పెరిగితే తృప్తి  పడరు. ఇం కా కావాలి కావాలి అంటారు.  నబీ ఎప్పుడు తప్పుడు ప్రవచనం  ఇవ్వడు కదా. మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నాం.  ఎండాకాలంలో మా చిన్నప్పుడు చేతి విసనకర్రతో ఉక్కపోతతో ఉపశమనం పొందే వాళ్లం. పవర్ జనరేట్ అయ్యాక ఇళ్లలోకి కరెంట్ సప్లయ్ అయ్యింది. అప్పుడు ఫ్యాన్లతో సరిపెట్టుకున్నాం. జనాల దగ్గర డబ్బు ఎక్కువైతే విలాసవస్తువులపై మనసు పడుతుంది. ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఎయిర్ కూలర్ల స్థానే ఎయిర్ కండిషన్ల ను కొనుగోలు చేస్తున్నారు. మన చెప్పులను స్థూల కాయులు ఒకసారి వేసుకుంటే ఆ చెప్పులు మళ్లీ మనకు వదులవుతాయి. మన తలకు సరిపడే హెల్మెట్ ను పెద్ద తల కాయ ఉన్న వ్యక్తి పెట్టుకుంటే ఆ హెల్మెట్ కూడా వదులవుతుంది. మనిషి కోర్కెలు పెరిగితే అవి తీరవు . అప్పుడు మనిషి డిప్రెషన్  కు లోనవుతాడు. డబ్బున్న వ్యక్తులను చూసి మనకూ లేదని  మనలో విద్వేషం పెరుగుతుంది. నాకు అంత డబ్బు లేదు అని బాధపడొద్దు. కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యక్తులకు అరుగుదల తగ్గిపోతుంది. అరుగుదల ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ధనికుడి కంటే పేదవాడు కంటినిండా నిద్రపోతాడు. డబ్బులెక్కువైన వ్యక్తి నిద్రమాత్రలు వేసుకుంటేనే కంటినిండా నిద్రపోతాడు.40 ఏళ్లు కష్టపడ్డా క్యారెక్టర్ లోపిస్తే అన్నీ పోయినట్టే. క్యారెక్టర్ పెంచుకునే యత్నం చేయాలి. అందం పోయినా పర్వాలేదు  కాని మన వ్యక్తిత్వం పోకుండా జాగ్రత్తపడాలి. పైసా హాత్ కా మైలా హై. ఇల్మ్ నహీతో సబ్ కుచ్  చీన్ లేగా అల్లా                                                                                                                 -బదనపల్లి శ్రీనివాసాచారి  
Publish Date: Oct 4, 2024 5:27PM

తిరుమలకు చంద్రబాబు దంపతులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలకు వెళ్ళారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం సందర్భంగా సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్రవారం జరిగే ధ్వజారోహణం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7.40 గంటలకు బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మాఢవీధుల్లో జరిగే పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి పద్మావతి అతిథిగృహంలో బసచేస్తారు. శనివారం ఉదయం 7.35 గంటలకు పాంచజన్యం వెనుక నిర్మించిన వకుళమాత నూతన కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారు. అనంతరం 9 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తారు.
Publish Date: Oct 4, 2024 4:54PM

పడవ మునిగి 78 మంది మృతి

కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా పట్టణం నుంచి గోమా పట్టణానికి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు ఓవర్‌ లోడ్‌ కారణంగా గోమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో బోల్తా పడింది. కివూ సరస్సులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా 200 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. కాంగో ప్రభుత్వ బలగాలకు, ఎం23 తిరుగుబాటుదారులకు మధ్య గత మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధం కారణంగా పలు రోడ్డు మార్గాలను మూసివేశారు. గోమాకు చేరుకోవడానికి చాలా మంది పడవలను ఆశ్రయిస్తున్నారు. దాంతో పడవలు కిక్కిరిసిన జనంతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ప్రమాదం జరిగింది.
Publish Date: Oct 4, 2024 4:25PM

యూట్యూబ్‌లో ఇక 3 మినిట్స్ షార్ట్స్!

యూట్యూబ్ లవర్స్.కి గుడ్ న్యూస్. యూట్యూబ్ తన షార్ట్స్.లో కీలకమైన అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇకపై కంటెంట్ క్రియేటర్లు మూడు నిమిషాల నిడివి వున్న వీడియోలను అప్‌లోడ్ చేసుకునే వెసులుబాటును తీసుకొస్తున్నట్టు యూట్యూబ్ ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి ఈ మార్పు రానుంది. దీంతో కంటెంట్ క్రియేటర్లు తమ కంటెంట్‌తో యూజర్లకు మరింత చేరువ కావడానికి  వెసులుబాటు కలగనుంది. యూట్యూబ్ షార్ట్స్.ని తీసుకొచ్చిన కొత్తలో కేవలం 60 సెకండ్ల లోపు వీడియోల మాత్రమే దృష్టిని కేంద్రీకరించింది. ఒక విధంగా చెప్పాలంటే టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లాంటి ఇతర ప్లాట్‌ఫామ్లకు పోటీని ఇవ్వడంలో ఇది యూట్యూబ్‌కి సహాయపడింది. ఈ క్రమంటో కంటెంట్ క్రియేటర్ల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని షార్ట్స్ నిడివిని మూడు నిమిషాలకు పెంచాలని యూట్యూబ్ నిర్ణయించింది. మూడు నిమిషాల నిడివి కలిగిన షార్ట్స్.ని యూజర్లు పొందేలా తన రికమండేషన్స్.లో మార్పులు చేయనుంది. దీంతోపాటు కంటెంట్ క్రియేషన్‌కి సంబంధించిన మరికొన్ని కొత్త ఫీచర్లను యూట్యూబ్ ప్రకటించింది. కొత్తగా టెంప్లేట్ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ట్రెండింగ్ వీడియోలను ‘రీమిక్స్ బటన్’ ద్వారా కొత్త వీడియోగా రీ క్రియేట్ చేయొచ్చున. ట్రెండింగ్, పాపులర్ వీడియోలకు పర్సనల్ టచ్ ఇవ్వడంలో కంటెంట్ క్రియేటర్లకు ఈ ఫీజర్ ఉపయోగపడనుంది. అలాగే యూట్యూబ్‌ కంటెంట్‌ని షార్ట్స్.గా మలిచేందుకు రాబోయే కొన్ని నెలల్లో కొత్త ఫీచర్ని యూట్యూబ్ అందుబాటులోకి తీసుకురాబోతోంది.
Publish Date: Oct 4, 2024 4:22PM