Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బోయపాటి బాలీవుడ్ ఎంట్రీ.. పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు ఖాయం!
posted on: Mar 15, 2026 5:41PM

టాలీవుడ్‌లో ఊరమాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu). ఇప్పుడు ఆయన బాలీవుడ్ బాక్సాఫీస్‌పై కన్నేసినట్లు కనిపిస్తోంది. సన్నీ డియోల్ హీరోగా బోయపాటి శ్రీను ఒక భారీ యాక్షన్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ఒక క్రేజీ వార్త వైరల్ అవుతోంది.
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ నటించిన 'జాట్' (Jaat) సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సన్నీ డియోల్ మార్క్ యాక్షన్, గోపీచంద్ మలినేని మాస్ ఎలివేషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ 'జాట్ 2' రూపొందించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే గోపీచంద్ మలినేని ప్రస్తుతం 'NBK111' ప్రాజెక్టుతో బిజీగా ఉండటంతో, సీక్వెల్ కోసం నిర్మాతలు మరో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.

బోయపాటి శ్రీను సినిమాల్లో హీరోల ఎలివేషన్లు, భారీ యాక్షన్ సీన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో మనకు తెలుసు. సన్నీ డియోల్ బాడీ లాంగ్వేజ్‌కు, బోయపాటి మేకింగ్ స్టైల్ పక్కాగా సరిపోతుందని నిర్మాతలు భావిస్తున్నారట. ఒకవేళ బోయపాటి ఈ ప్రాజెక్టుకు ఓకే చెబితే, బాలీవుడ్‌లో సరికొత్త యాక్షన్ విస్ఫోటనం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
సన్నీ డియోల్ ఇటీవల 'బార్డర్ 2'తో ప్రేక్షకులను పలకరించి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం 'రామాయణ'తోపాటు 'గబ్రు', 'లాహోర్' వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ లోపు 'జాట్ 2'కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తవుతాయని సమాచారం.
బోయపాటి డైరెక్షన్‌లో సన్నీ డియోల్ సినిమా అంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుంది అనడంలో డౌట్ లేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.






