రాష్ట్రపతి కోటా రాజ్యసభ సభ్యుల్లో దక్షిణాదికి అగ్రతాంబూలం

బీజేపీ దక్షిణాదిలో వేళ్లూనుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విదంగా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులుగా నలుగురు దక్షిణాది వారికి నామినేట్ చేసింది. ప్రముఖ తెలుగు సినీ రచయత, దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, అలాగే పరుగుల రాణి, ఒలింపిక్ పతక విజేత పీటీ ఉష, ధర్మస్థల ధర్మాధికారి  వీరేంద్ర హెగ్డేలను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ట్వీట్ చేసి తెలిపారు. రాష్ట్రపతి కోటా కనుక వీరంతా నేరుగా రాజ్యసభకు నామినేట్ అయినట్లే ఎటువంటి పోటీ ఎన్నిక ఉండదు.

తెలుగు సినిమా రచయత  విజయేంద్ర ప్రసాద్ దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి. దాదాపు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకూ ఆయనే రచయత. అలాగే సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ బజరింగీ  భాయీజాన్ కు కథ అందించింది కూడా విజయేంద్ర ప్రసాదే. ఇక తమిళనాడుకు చెందిన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గురించి పరిచయమే అవసరం లేదు. ఎన్నో సుమధుర గీతాలకు సంగీతం అందించిన లబ్ధ ప్రతిష్టుడాయన.

భారత్ కు ఒలింపిక్ మెడల్ అందించిన కేరళకు చెందని పరుగుల రాణి పీటీ ఉష. దేశంలో ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలిచిన స్పోర్ట్స్ ఉమన్.   అలాగే కర్నాటకకు చెందిన వీరేంద్ర హెగ్. ఆయన కర్ణాటకలోని ప్రసిద్ధ అధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థల ధర్మాధికారి.

వీరందరూ నామినేటెడ్ ఎంపీలే అయినా మిగిలిన రాజ్యసభ సభ్యులలాగే ఆరేళ్ల పదవీ కాలం ఉంటుంది. రాష్ట్రపతి కోటాలో వివిధ రంగాల్లో ప్రముఖులైన వారిని రాజ్యసభకు పంపిస్తూ ఉంటారు.  బీజేపీ ఈ సారి ఏకంగా నలుగురు దక్షిణాది వారిని రాజ్యసభకు నామినేట్ చేసి దక్షిణాదిలో బలోపేతం కావాలన్న లక్ష్యాన్ని బలంగా చాటింది.