పురోహితులకు అండ‌గా నిలిచిన మాజీ ఎమ్మెల్యే!

లాక్ డౌన్ తో దేవాలయాలు సైతం మూడపడడంతో వీటిపైనే ఆధారపడి జీవిస్తున్న పురోహితులు, బ్రాహ్మణులకు జీవనం దుర్భరమైంది. ప్రభుత్వ సాయం అందక ఇబ్బందులు పడుతున్న వీరికి బిజెపి నేతలు అండగా నిలిచారు. బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఆధ్వర్యంలో డా. ఏ.ఎస్.రావు నగర్, మౌలాలి, నాచారం, రామాంతపూర్ తదితర ప్రాంతాల్లో బ్రాహ్మణులకు బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు అందించారు. 300కు పైగా కుటుంబాలు ఈ సాయాన్ని అందుకొని సంతోషం వ్యక్తం చేశాయి.