ఏపీ రాజధాని అమరావతి పై బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందా..!

అమరావతి రైతులు తమ హక్కుల కోసం అలాగే రాజధానిని అమరావతిలోని కోసాగించాలని కోరుతూ మొదలు పెట్టిన ఉద్యమం రెండు రోజుల క్రితం రెండు వందల రోజులకు చేరింది. ఈ సందర్భంగా వైసిపి తప్పించి మిగిలిన అన్ని పార్టీలు ఆ రైతులకు మళ్ళీ సంఘీభావం తెలిపాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ కూడా ఈ పోరాటానికి సంఘీభావంగా ట్వీట్ చేసారు. ఇదే సందర్భంలో ఎంపీ సుజనా చౌదరి రాతులను ఉద్దేశించి వర్ట్యువల్ కాన్ఫరెన్స్ లో ప్రసంగిస్తూ రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ విషయంలో ఎవరు భయపడవలసిన అవసరం లేదని రాజధాని అమరావతి నుండి ఒక్క ఇంచ్ కూడా కదలదని స్పష్టం చేసారు. సరైన సమయంలో కేంద్రం దీనిపై జోక్యం చేసుకుంటుందని కూడా అయన తెలిపారు.

ఇది జరిగిన రెండు రోజుల్లోనే ఒక టీవీ డిబేట్ లో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తమ పార్టీ అమరావతికి సంఘీభావం తెలుపుతుందని ఐతే ఈ విషయంలో కేంద్రం మాత్రం జోక్యం చేసుకోదని అన్నారు. ఇపుడు తాజాగా ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవధర్ అమరావతికి మద్దతు ప్రనటించారు. ఐతే ఈ అంశం లో కేంద్రం జోక్యం చేసుకోదని తేల్చి చెప్పారు. దీంతో అటు అమరావతికి భూములిచ్చిన రైతులలోను, ఇటు రాష్ట్ర ప్రజలలోను అయోమయం నెలకొంది. ఒక పక్క అమరావతికి మద్దతు అంటున్న బీజేపీ నేతలు మరో పక్క కేంద్రం జోక్యం విషయంలో మాత్రం రెండు రకాలుగా మాట్లాడుతూ ఉండడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.