జగన్ రెడ్డి రక్షణకు కమల దళం కుట్రలు

ఆంధ్ర ప్రదేశ్’లో బీజేపీకి ఉన్న బలమేమిటో,బలహీనతలు ఏమిటో, అందిరికీ తెలిసిందే. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, కమల దళం రాష్ట్రంలో రాజకీయాలను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు సాగిస్తోందని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  ఉదాహణకు ఆత్మకూరు ఉప ఎన్నిక విషయాన్నే తీసుకుంటే, బీజేపీకి డిపాజిట్  రాలేదు, కానీ, గతంతో పోల్చుకుంటే, ఉప ఎన్నికల్లో కొంచే ఎక్కువ ఓట్లు అయితే వచ్చాయి. అయితే, ఆ మాత్రంగా ఓట్లు వచ్చాయంటే, అందుకు కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. అదేమీ రహస్యం కాదు ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అన్నట్లుగా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేక పోవడం వలన, బీజేపీ అభ్యర్ధికి 14 శాతం ( 19 వేల చిల్లర ఓట్లు) పైగా ఓట్లు వచ్చాయి. అయితే అది బలుపు కాదు వాపు మాత్రమే. బీజేపీ నాయకులూ మురిసి  పోయేంత గొప్ప ముందడుగు అయితే అసలే కాదు.  అందుకే,  పార్టీలో కొందరు నాయకులు వాపును చూసి బలుపని సంబర పడుతున్నా పార్టీ పుట్టు పూర్వోత్తరాలు తెలిసిన సీనియర్ నాయకులు మాత్రం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏమిటో, పార్టీ బలమేమిటో, బలహీనతలు  ఏమిటో, ఎవరికి తెలిసినా తెలియక పోయినా, పార్టీ జాతీయ నాయకత్వానికి మాత్రం బాగా తెలుసునని అంటున్నారు.  

నిజం, రెండు పార్టీలు వ్యవస్థ  బలంగా బలంగా స్థిర పడిన రాష్ట్రంలో, మరో పార్టీ కాలు పెట్టి నిలదొక్కుకోవడం అంత ఈజీ వ్యవహారం కాదు. అందుకే, కాంగ్రెస్, టీడీపీ బలంగా ఉన్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ బీజేపే ఒంటరి పోరాటం చేయలేక పోయింది. బీజేపే జాతీయ నాయకత్వం కూడా రాష్ట్రంపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. తెలుగు దేశం పంచన తలదాచుకుంది. అక్కడొకటి ఇక్కడ రెండు అన్నట్లుగా,  నాలుగు స్థానాలు గెలుచుకుని ఉనికిని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేస్తూ వచ్చింది.  

అదే క్రమమలో రాష్ట్ర విభజన తర్వాత కూడా 2014 ఎన్నికలలోనూ తెలుగు దేశంతో పొత్తును కొనసాగించింది. ఏపీ నుంచి నాలుగు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా రెండు మంత్రి పదవులు దక్కించుకుని. అలాగే, కేంద్రంలో ప్రధాని మోడీ మంత్రి  వర్గంలో తెలుగు దేశం పార్టీ  చేరింది. అయితే, 2018లో  ఉభయ పార్టీల మధ్య ‘ప్రత్యేక హోదా’ విషయంలో పేచీ రావడంతో, పొత్తు చెడింది. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అనేది చరిత్ర. 2019 ఎన్నికల్లో కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ, అధికారం కోల్పోయింది. ఇక ఇప్పడు ప్రస్తుతానికి వస్తే, జాతీయ స్థాయిలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన బీజేపీ  పంధా మార్చింది. ఉత్తరాది, దక్షిణాది అని  లేకుండా విస్తరణ యాత్రను ప్రారంభించింది.  రెండు పార్టీల వ్యవస్థ బలంగా ఉన్న రాష్ట్రాలలో అంచెలంచెలుగా అడుగులు ముందుకు వేస్తోంది.

అందులో భాగంగానే, ఏపీ మీద కూడా కమల దళం కన్నేసింది. ఈశాన్య రాష్ట్రాలలో  సక్సెస్ అయిన ఫార్ములాను ఎపీలోనూ ఇంప్లిమెంట్’ చేసే ప్రయత్నం సాగిస్తోంది. అధికార వైసేపీతో అంటకాగుతూ, తెలుగు దేశం పార్టీ టార్గెట్’ గా రాజకీయం చేస్తోంది. నిజానికి,రాష్ట్రంలో ఒంటరిగా పోటీచేస్తే. ఆ పార్టీ పరిస్థితి ఏమిటో, 2019 ఎన్నికల్లోనే తెలిపోయింది. నోటా’కంటే తక్కువగా ఒక శాతానికి కొంచెం అటూ ఇటుగా ఓట్లు పోలయ్యాయి.  
అందుకే ఇప్పుదు బీజేపీ కొత్త  ఎత్తు వేసింది, వైసీపీ కి అండగా నిలిచి తెలుగు దేశం పార్టీని మరో మారు ఓడించేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే, వైసీపే వ్యతిరేక ఓటును చెల్చేందుకు, కుటిల యత్నాలు సాగిస్తింది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పావుగా ఉపయోగించుకుంటోంది. నిజానికి పవన్ కళ్యాణ్’ వైసేపీ ప్రభుత్వ దుర్మార్గ, దుష్ట పాలన నుంచి రాష్ట్రాన్ని  రక్షించే, లక్ష్యంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీచేయాలని ప్రతిపాదించారు.

అయితే, ఒకటి  తర్వాత ఒకటిగా ప్రాంతీయ పార్టీలను దిగమింగే యోచనతో ముందుకు సాగుతున్న బీజేపీ, తెలుగు దేశం, జనసేన పొత్తుకు అడ్డుపుల్లలు వేస్తోంది.మోకాలడ్డుతోంది. ఆయనలో అనవసరపు ఆశలు రేకెత్తించి, టీడీపీకు దూరం చేసే ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవంక ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగింఛి, సామాజిక సమీకరణలను తారుమారు చేసే కుట్రకు పథకం రచిస్తున్నట్లు, తెలుస్తోంది. 
అయితే, ఆంధ్ర ప్రదేశ్’లో కమల దళం వ్యూహాలు ఫలిస్తాయా అంటే, అది అంత ఈజీ కాదని,, సామాన్యుల నుంచి విశ్లేషకుల వరకు అందరూ భావిస్తున్నారు.

ముఖ్యంగా  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా  ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంటున్న నేపధ్యంలో, ఒక్కసారి మోసపోయిన ప్రజలు మరొక్కసారి మోస పోయేందుకు సిద్ధంగా లేరని రాజకీయ పండితులు అంటున్నారు. అదే విధంగా రాష్ట్రానికి ఏ మేలు చేయని బీజేపీతో చేతులు కలపడం వలన. ఆపార్టీ అనుసరించే  హిందూమతోన్మాదం విధానాల వలన జనసేన కూడా మూల్యం చెల్లించవలసి వస్తుందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  నిజానికి, పొత్తులు, ఎత్తులు, రాజకీయ,సామాజిక సమీకరణలు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రజానీకం మాత్రం వైసీపీ వినాశకర విధానాలనుంచి, రాష్ట్రాన్ని రక్షించే సామర్ధ్యం ఒక చంద్రబాబుకు మాత్రమే ఉందని, వైసీపీకి టీడీపీ తప్ప మరో ప్రత్యాన్మాయం అయ్యేపని కాదని నిర్ణయానికి వచ్చారని, విశ్లేషకులు అంటున్నారు.