Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ
posted on: Mar 3, 2026 2:58PM

రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. కమలం పార్టీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్, శివేశ్ కుమార్, బిహార్ నుంచి ఎంపిక కానున్నారు. అస్సాం నుంచి తెరాశ్ గోవల్ల, జోగెన్ మోహన్, ఛత్తీస్గఢ్ నుంచి లక్ష్మీ వర్శ, హరియాణా నుంచి సంజయ్ భాటియా, ఒడిశా నుంచి మన్మోహన్ సమాల్, సుజీత్ కుమార్, పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాను కాషాయ పార్టీ ఎంపిక చేసింది. ఈ నెల 16న ఎన్నికలు జరగనున్నాయి.10 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పదవీ కాలం ముగియనుంది. వీరి పదవి కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుండటంతో రాజ్యసభ ఎంపీల ఎన్నిక అనివార్యమైంది.
కాగా రాజ్యసభ ఎన్నికకు సంబంధంచి ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 5న నామినేషన్లకు చివరి తేదీ కావడంతో రెండు రోజుల్లో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. కాగా రాజ్యసభ సభ్యుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేసింది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించి రాకపోయినప్పటికీ పార్టీ గెలుపుకు కృషి చేసిన నేతలకు ఈ సీట్లు కేటాయించాలనే అంశంపై పార్టీ నాయకుల మధ్య చర్చ జరిగింది. కాగా, రాజ్యసభ ఎంపీల రేసులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.



.webp)


