Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాహుల్‌కి సన్నాయి ఊదిన బిస్మిల్లాఖాన్ కుటుంబం
posted on: May 10, 2014 3:16PM
.jpg)
ప్రముఖ షహనాయ్ విద్వాంసుడు దివంగత బిస్మిల్లాఖాన్‌ని యావత్ భారతదేశం గౌరవిస్తుంది. కానీ, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆ గౌరవాన్ని నిలుపుకునేలా ప్రవర్తించలేదు. వీళ్ళు షహనాయ్ ఊదడంలో ఎంత ప్రతిభావంతులో తెలియదుగానీ, అబద్ధాలు చెప్పడంలో మాత్రం ఘనాపాటీలన్న విషయం తెలిసిపోయింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వారణాసి నుంచి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తూ స్థానికులైన బిస్మిల్లాఖాన్ కుటుంబ సభ్యులు తనను ఎంపీ అభ్యర్థిగా నామినేట్ చేస్తూ సంతకాలు చేస్తే బాగుంటుందని ఆశించారు. ఆ విషయాన్ని బిస్మల్లాఖాన్ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకుని వెళ్ళారు. దానికి వాళ్ళు బీజేపీ అంటేనో, మోడీ అంటేనో తమకు ఇష్టం లేదు కాబట్టి సంతకాలు చేయడానికి రాలేం అని చెబితే ఇబ్బంది వుండేది. కానీ బిస్మిల్లాఖాన్ కుటుంబ సభ్యులు ఏమీ ఎరుగని పత్తిత్తుల్లాగా మాట్లాడారు. మా నాన్నగారికి (బిస్మి్ల్లాఖాన్‌కి) రాజకీయాలంటే అస్సలు ఇష్టం వుండేది కాదు. మమ్మల్ని కూడా రాజకీయాల జోలికి వెళ్ళొద్దని చెప్పారు. అందువల్ల మేం రాలేం అని చెప్పారు. పాపం పెద్దాయన చెప్పిన మాటకి కట్టుబడి వున్నార్లే అని అందరూ ఊరుకున్నారు. అప్పుడు మోడీ నామినేషన్‌కి స్థానికులైన కొందరు కార్మికులు సంతకాలు చేశారు. అక్కడితో ఈ ఇష్యూ ముగిసింది. అయితే తాజాగా వారణాసిలో రాహుల్ గాంధీ నిర్వహించిన రోడ్ షోకి బిస్మిల్లాఖాన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. భుజాల మీద కాంగ్రెస్ కండువాలు వేసుకుని, షహనాయ్‌లు ఊదుతూ రాహుల్‌కి స్వాగతం పలికారు. మరి రాజకీయాల జోలికి వెళ్ళొద్దని బిస్మిల్లాఖాన్ చెప్పిన (?) మాటని వీళ్ళు మరచిపోయారో లేక అబద్ధం చెప్పారో ఆ పైనున్న బిస్మిల్లాఖాన్‌కే ఎరుక. మొత్తానికి రాహుల్‌కి వీళ్ళు సన్నాయి ఊదుతూ స్వాగతం చెప్పడం కోసం రాహుల్ వీళ్ళదగ్గర ఎన్ని ‘లక్షల’ సన్నాయిలు ఊదాడో మరి!


.jpg)



