న‌డిరోడ్డుపై బైక్ త‌గ‌ల‌బెట్టి.. పోలీస్ చ‌లాన్ల‌పై తిరుగుబాటు..

ఇది ఇండియా. ఇక్క‌డ ఎలాగైనా ఉండొచ్చు. ఎవ‌డిష్టం వాడిది. జ‌నాలు బాగా ముదురు. రూల్స్ గీల్స్ ఏవీ పాటించ‌రు చాలామంది. మ‌న‌దాకా వ‌చ్చాక చూసుకుందాంలే అనుకుంటారు. అలానే ఓ యువ‌కుడు ట్రాఫిక్ రూల్స్‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. హెల్మెట్ పెట్టుకోడు. బైక్ నెంబ‌ర్ ప్లేట్ స‌రిగ్గా పెట్ట‌డు. సిగ్న‌ల్స్ జంప్ చేస్తుంటాడు. త్రిబుల్ రైడింగ్ స‌రేస‌రి. ట్రాఫికోళ్లు త‌న బండిని ఆప‌డం లేద‌నే ధీమాతో ఓవ‌ర్ చేస్తుంటాడు. 

కానీ, మ‌న ఖాకీలు వాడికంటే ముదురు. అత‌న్ని ఒక్క‌సారి కూడా ఆప‌క‌పోయినా.. అనేక‌సార్లు కెమెరా క్లిక్ మ‌నిపించారు. వాడి బండిపై అనేక చ‌లాన్లు ఉన్నాయి. ఫ‌స్ట్ టైమ్ ఓ చ‌లాన్ చూసి అత‌డు షాక్ అయ్యాడు. ఆ త‌ర్వాత ఇంకో చ‌లాన్‌. మ‌రోసారి మ‌రో చ‌లాన్‌. ఇలా చ‌లాన్లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ పోలీసోళ్లు మామూలోళ్లు కాదంటూ తెగ తిట్టేసుకుంటున్నాడు. కానీ, ఫైన్లు మాత్రం క‌ట్ట‌ట్లేదు. 

క‌ట్‌చేస్తే.. లేటెస్ట్‌గా అత‌ను బైక్‌పై వెళుతుంటే.. ట్రాపిక్ పోలీసులు మ‌రోసారి ఫోటో తీశారు. అది చూసిన మ‌నోడు.. కోపం ప‌ట్ట‌లేక‌పోయాడు. నీ.... ఇంకా ఎన్నిసార్లు ఫైన్లు వేస్తారంటూ.. ఆవేశంతో ఊగిపోయాడు. న‌డిరోడ్డు మీద.. జంక్ష‌న్ మ‌ధ్య‌లో బైక్ ఆపేసి.. బండికి నిప్పు పెట్టాడు. 

వాడి చేష్ట‌ల‌కు అక్క‌డున్న పోలీసులు అవాక్క‌య్యారు. వెంట‌నే వ‌చ్చి.. మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు. స్థానికులు బండిపై నీళ్లు చ‌ల్లి మంట‌లు ఆర్పేశారు. బైక్‌నే త‌గ‌ల‌బెట్టేంత కోపం వ‌చ్చిందంటే.. ఖాకీలు అత‌నికి ఎన్నిసార్లు ఫైన్లు వేశారో ఏమో.. అయినా, రూల్స్ పాటిస్తే.. వాళ్లెందుకు చ‌లాన్లు వేస్తారు చెప్పండి. అలా కోపం తెచ్చుకునే బ‌దులు.. రూల్స్ ఫాలో అయితే స‌రిపోతుందిగా అంటున్నారు. ఇదంతా ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని ఖానాపూర్‌లో జ‌రిగింది. బండి త‌గ‌ల‌బెట్టిన అత‌ని పేరు.. మ‌క్బూల్‌.