కడ్తాల్ లో రేవ్ పార్టీ..

నేటి యువత వారం అంత కష్టపడ్డామా వీకెండ్ వస్తే మందు చిందు వేస్తూ  ఎంజాయ్ చేశామా .. అనేదే ఈ యువత రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు. ఎంజాయ్,  ఫ్రీడమ్, ఆలౌన్ గా ఉండమే పరిపూర్ణమైన జీవితం అని అనుకుంటున్నారు. వారి ఎంజాయ్ పక్కన పెడితే వాళ్ళ ఎంజాయ్ వల్ల ఎంత మంది డిస్ట్రబ్ అవుతున్నారు అనేది వాళ్లకు పట్టడం లేదు.  

హైదరాబాద్ కి సరిగ్గా 49 దూరంలో శ్రీశైలం హైవే మీద ఉన్న గ్రామం అది.. ఆ గ్రామం పేరు కడ్తాల్‌. రాజధాని సిటీకి దగ్గర ఉండడం వల్ల హైదరాబాద్ ప్రభావం బాగానే ఉందని చెప్పలి. ఇక యువతీయువకుల విషయానికి వస్తే.. జల్సాలకు అలవాటు పడ్డారు.. హైదరాబాద్ లో అయితే వీకెండ్స్ వస్తే చాలు పబ్బులల్లో పండగలు స్టార్ట్ అవుతాయి.. వీకెండ్ పార్టీస్ కాకుండా అప్పుడప్పుడు రేవ్ పార్టీలు జరుగుతుంటాయి.. ఈ మధ్య కాలం లో ఎంఐఎం పార్టీ నాయకుడి రేవ్ పార్టీ కూడా హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. ఆ విషయం మారిపోక ముందుకే మరో రేవ్ పార్టీ వెలుగులోకి వచ్చింది.  

తాజాగా కడ్తాల్ లో కొంత మంది రేవ్ పార్టీ నిర్వహించారు.. ఆ పార్టీ స్థానికులతో  కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ నిర్వహించుకుంటున్నా పదిహేను జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్‌డే పార్టీ పేరుతో ఫామ్ హౌస్ లో మందు వేసి చిందులు వేశారు. హైదరాబాద్ కు చెందిన 30 మంది యువతీ యువకులు పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా రేవ్ పార్టీ పై దాడి చేశారు. అందర్నీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అయితే ఈ పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళ సంబంధించిన వారంతా ఉన్నారని సమాచారం. మరోవైపు హైదరాబాద్‌లోని వివిధ కంపెనీలకు చెందిన సుమారు 70 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. రాత్రి మద్యం సేవిస్తూ, డీజే శబ్దాలతో హోరెత్తిస్తూ చిందులు వేస్తూ, డాన్సులు చేశారు. ఎస్‌వోటీ పోలీసులు, కడ్తాల్‌ ఎస్‌ఐ సుందరయ్య ఆధ్వర్యంలో ఫాంహౌస్‌పై రాత్రి 11.30 గంటలకు దాడులు నిర్వహించారు.

నిర్వాహకుల్లో ఒకరైన వరుణ్‌గౌడ్‌ పారిపోగా.. ముగ్గురు నిర్వాహకులు, 21 మంది యువతులు, 43మంది యువకులను అరెస్టు చేశారు. 47 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కందుకూరు మండలం రాచులూరుకి చెందిన ఫాంహౌస్‌ యజమాని భరత్‌ ఏ-1, నిర్వాహకులు మెహిదీపట్నానికి చెందిన జిషాన్‌ అలీఖాన్‌ ఏ-2, ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన అన్వేష్‌ ఏ-3, పరారీలో ఉన్న వరుణ్‌గౌడ్‌పై ఏ-4గా కేసు నమోదు చేశారు. అయితే ఈ పార్టీ బర్త్‌డే పార్టీ అని చెబుతున్నా... అలా ఏ మాత్రం లేదని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. పార్టీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో... రేవ్ పార్టీకి మించి ఉందని పలువురు విమర్శిస్తున్నారు.

ఇది పరిస్థితి నేటి యువత రేవ్ లు అని కేవులు అని ఎంజాయ్ చేయడం తప్పితే.. భవిష్యత్తు మీద బాధ్యతగా లేరని కడ్తాల్ స్థానికులు మాట్లాడుకుంటున్నారు.. ఎంజాయ్ అంటే పర్సనల్ విషయం అని ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. ఇలా బయటికి వచ్చి రేవ్ పార్టీలు చేస్తే వాళ్ళను చూసి గ్రామాల్లో ఉన్న యువత కూడా తప్పుదోవ పట్టే  అవకాశాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు..