వైసీపీ ఎమ్మెల్సీకి దక్కిన బాలాపూర్ లడ్డూ.. పాత రికార్డులు బద్దలు

హైదరాబాద్ లో వినాయన చవితి వేడుకలు అంటే ఖైరతాబాద్ మహా గణపతి తర్వాత అంతే ఫేమస్ బాలాపూడ్ లడ్డూ. ఖైరతాబాద్ మహా గణపతికి పూజలు చేసేందుకు భక్తులు పోటెత్తితే.. బాలాపూర్ గణపతి లడ్డూ ఫేమస్. బాలాపూర్ లడ్డూ వేలానికి అంతర్జాతయ స్థాయిలో గుర్తింపు ఉంది. బాలాపూడ్ లడ్డూను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా పోటీ పడతారు. బాలాపూడ్ లడ్డూ వేలాన్ని చూసేందుకు వేలాది మంది తరలివస్తారు.

ప్రతి ఏటా లడ్డూ వేలం పాలం పాటలో రికార్డులు స్పష్టిస్తూ ఉంటుంది బాలాపూర్ లడ్డూ. ఈ సంవత్సరం కూడా ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. బాలాపూర్ ల‌డ్డూ మ‌రోసారి రికార్డు ధ‌ర ప‌లికింది. వేలం పాట‌లో ఆ ల‌డ్డూ రూ.18.90 ల‌క్ష‌లకు అమ్ముడుపోయింది. ఈ ల‌డ్డూను కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ  ర‌మేశ్ యాద‌వ్ , మ‌ర్రి శ‌శాంక్ రెడ్డి ద‌క్కించుకున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రమేష్ రెడ్డి. 2019లో జరిగిన వేలంలో రూ.17లక్షలా 60వేలు పలికింది. దీంతో గత ఏడాది కంటే ఈసారి లడ్డూ ధర లక్షా 30 వేలు పెరిగింది. కరోనా కారణంగా గత ఏడాది వేలం పాటను రద్దు చేసిన విషయం తెలిసిందే.

కాగా హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం కోసం పోలీసులు న‌గ‌ర వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.  నగరంలో ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ వెళ్లే వైపుగా శోభాయాత్రలో పాల్గొనే వాహనాలను మిన‌హా ఇతర వాహనాలను అనుమతించట్లేదు. హైదరాబాద్‌లోని నలుమూలల నుంచి ప్రజలు ట్యాంక్ బండ్ కు గ‌ణేశ్ నిమ‌జ్జ‌నాల కోసం వ‌స్తున్నారు.