అమరావతికి చట్టబద్ధత.. బాలకృష్ణ హర్షం

posted on: Apr 7, 2026 10:50AM

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంపై హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో  జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి అంటూ చేసిన ఓ ట్వీట్ లో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు.

 అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడంలో సహకరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు, ఎంపీలకూ, ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ హృదయపూర్వక కృతజ్ణతలు తెలిపారు.  అమరావతికి చట్టబద్ధతతో పెట్టుబడిదారులకు భరోసా కలుగుతుందన్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...