Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాహుబలి కోసం టెన్షన్ గా వెయిట్ చేస్తోన్న జనం… ఈ టెన్ ఫ్యాక్ట్సే కారణం!
posted on: Apr 26, 2017 12:15PM
.jpg)
ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి! కారు చీకట్లు ముసురుకుంటున్నాయి! ఏ క్షణాన అయినా చినుకులు రాలవచ్చు! ఒక్కసారి వర్షం మొదలైందా… ఇక తుఫానే! ఇదంతా చెబుతోంది వాతావరణ సూచన కాదు! ఎర్రటి ఎండా కాలంలో బాహుబలి బాక్సాఫీస్ పైకి దండెత్తి వస్తున్నాడు. కాసుల వర్షం… కలెక్షన్ల తుఫాన్ సృష్టించబోతున్నాడు! ఇంతకీ బాహుబలి 2, అదేనండీ, బాహుబలి ది కన్ క్లూషన్ మ్యానియాకు కారణం ఏంటి? పది ముక్కల్లో చెప్పకుంటే… ఆ టెన్ టెంప్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ బాహుబలి… ఇవే…
1. బాహుబలి 2 సినిమా క్లైమాక్స్ ఖర్చే మరో భారీ తెలుగు సినిమా బడ్జెట్ అంత! దాదాపు 30కోట్లు బాహుబలి పార్ట్ 2 క్లైమాక్స్ కోసం వెచ్చించారు. ఇది బాహుబలి ది బిగినింగ్ కన్నా రెట్టింపు!
2. బాహుబలి అనగానే మనకు ఇప్పటికిప్పుడు గుర్తుకు వచ్చే ప్రధానమైన సీన్స్ ఏవీ? ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్ కొండలపైనా, జలపాతలపైనా చేసిన విన్యాసాలు! మొదటి భాగం షూట్ చేస్తున్నప్పుడు జలపాతాల సీన్లు షూట్ చేయటానికి ముప్పాతిక సమయం సరిపోయిందట! అలాంటి కళ్లార్పనీయని దృశ్యాలు బాహుబలి 2లో ఇంకా వున్నాయట! అఫ్ కోర్స్, ఒళ్లు గగుర్పొడిచే యుద్ధాలతో పాటూ!
3. బాహుబలి ది కన్ క్లూషన్ షూటింగ్ 2015 డిసెంబర్లో ప్రారంభమైంది. ఒకటిన్నర సంవత్సరంలో రాజమౌళి తన సిల్వర్ స్క్రిన్ వండర్ ని సిద్ధం చేశాడు!
4. బాహుబలి 2 సినిమాకు సంబంధించి లీకైన కొన్ని ఫోటోలు పోయిన సంవత్సరం కలకలం సృష్టించాయి!
5. బాహుబలి హిందీ డబ్బింగ్ వర్షన్ వంద కోట్లు వసూలు చేసింది! కాని, ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమైన బాహుబలి 2 సాటిలైట్ రైట్సే 51కోట్లకు అమ్ముడుపోయాయి! సోనీ టీవీ ఈ భారీ మొత్తం ఖర్చు చేసి బాహుబలి 2 స్వంతం చేసుకుంది! ఒక డబ్బింగ్ సినిమా ఇంత ధర పలకటం హిందీలో ఇదే మొదటిసారి!
6. బాహుబలి ది కన్ క్లూషన్ లో అందర్నీ ఆకర్షిస్తున్న అంశం… ప్రభాస్, రాణా, అనుష్కల మధ్య నడవబోయే ముక్కోణపు ప్రేమకథ! భల్లాలదేవుడు దేవసేనని కోరితే… దేవసేన అమరేంద్ర బాహుబలిని ప్రేమిస్తుంది! వీరి కథలో శివగామి పాత్ర ఏంటి? ఇదే పెద్ద ట్విస్ట్ గా వుండనుంది!
7. బాహుబలి మొదటి భాగం చివర్లో అమరేంద్ర బాహుబలిని… సింహాసనాధీశుడ్ని చేసిన రాజమాత శివగామి… కట్టప్ప చేత అతడ్ని చంపిస్తుందా? వినటానికే విభ్రాంతికరంగా వున్న ఈ మలుపు బాహుబలి 2లో వుండబోతోందంటున్నారు! అదే నిజమైతే, శివగామి బాహుబలికి వ్యతిరేకంగా ఎందుకు మారింది? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న!
8. దేవసేనతో సహా మాహిష్మతీ రాజ్య సింహాసనం ఆశించిన బాహుబలి, భల్లాలదేవ… గంటలు, రోజుల తరబడి జిమ్ లో గడిపారు! 30కేజీల వరకూ బరువు పెరిగి భారీగా కనిపించిన ప్రభాస్ , రాణా ఇందుకోసం కఠోర శ్రమ చేయటమే కాక బోలెడు ఆహార నియమాలు కూడా పాటించారు! వియత్నాం నుంచీ వచ్చిన మార్షల్ ఆర్ట్స్ కోచ్ ట్యువాన్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు!
9. థియేటర్స్ కి వచ్చాక టికెట్ల అమ్మకం ద్వారా జరిగే బిజినెస్ కాకుండా ఇప్పటికే బాహుబలి 2 అయిదు వందల కోట్ల వ్యాపారం చేసింది! టెలివిజన్ రైట్స్ , థియేట్రికల్ రైట్స్ లాంటి ద్వారా ఈ అద్భుతం సాధించింది!
10. లాస్ట్ బట్ నాట్ లీస్ట్… బాహుబలి ది కన్ క్లూషన్… విడుదలకి ఒక్కో క్షణం దగ్గర పడుతున్నకొద్దీ అందరి మనస్సుల్లో ఒకే ప్రశ్న మెదులుతోంది! అదే… ‘’ కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడు? ’’ దీనికి సమాధానం దొరకాలంటే బాహుబలి బిగ్ స్క్రీన్ పైకి రెండోసారి రావాల్సిందే! And the countdown has already began…


.jpg)
.jpeg.jpg)


