బద్వేల్ బరిలో తేలేదేమిటి ? కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీనా? 

హుజూరాబాద్ ఉప ఎన్నికతో పాటుగా తెలంగాణ పొరుగు రాష్రం ఆంధ్ర ప్రదేశ్ లోని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత జిల్లా, కడపలోని బద్వేల్ శాసన సభ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. అక్కడా, ఇక్కడ కూడా ఒకే రోజు అక్టోబర్ 30 పోలింగ్ జరుగుతుంది. రెండు నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు ఒకే రోజు నవంబర్ 3న జరుగుతుంది. అయినా  రెండు రాష్ట్రాలలోని రెండు అసెంబ్లీ నియోజక వర్గాలకు జరుగతున్న ఉపఎన్నికల మధ్య ఇంతకు మించిన  పోలిక లేదు. తెలంగాణలోని హుజూరాబాద్ నియోజక వర్గంలో ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. అధికార తెరాసలో వచ్చిన అంతర్గత కుమ్ములాటలు, కుటుంబ కలహాల కారణంగా ఉప ఎన్నిక అనివార్యమైంది. 

కానీ, బద్వేల్ నియోజక వర్గం ఉప ఎన్నికకు రాజకీయాలు కారణం కాదు. అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య  చనిపోవడంతో బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.కాగా, వైసీపీ బద్వేలు టికెట్ ను డాక్టర్ వెంకటసుబ్బయ్య అర్ధాంగి డాక్టర్ దాసరి సుధకు ఇచ్చింది.ఈ నేపధ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయి, వారి కుటుంబ సభ్యులు పోటీ చేసిన సందర్భంలో, ప్రత్యర్ధులు ఎవరు పోటీ చేయరాదని, ఉమ్మడి రాష్టం నుంచి వచ్చిన సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం,జనసేన పోటీ చేయరాదని నిర్ణయించుకున్నాయి. అయితే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో, అనవసరమే అయినా, ఫలితం ముందుగానే తెలిసి పోయినా ఎన్నిక క్రతువు అనివార్యంగా జరుగుతోంది. బీజేపీ యువ నేత పనతల సురేశ్ బరిలో దించింది. కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్ల్యే కమలమ్మ పోటీ చేస్తన్నారు. అయినా ఉపన్నికల్లో గెలిచేది ఎవరో వేరే చెప్ప నక్కర లేదు, నామినేషన్’కు ముందే వైసీపే అభ్యర్ధి గెలిచారు. ముందుగా పోటీకి సిద్ధమై అబ్యార్ధిని ప్రకటించిన తెలుగు దేశం పార్టీ పోటీలో కొనసాగి ఉంటే, లెక్క మరోలా ఉండేది. కానీ, జనసేన  పోటీ నుంచి తప్పుకున్న తర్వాత టీడీపీ కూడా స్నుభుతి వైపు మొగ్గు చూపింది. ఇలా, గత ఎన్నికలలో 70 వేలకు పైగా ఓట్లు వచ్చిన టీడీపీ పోటీ నుంచి తప్పుకుని, ఆటలో అరటి పండు లాంటి బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే పోటిలో ఉండడంతో  బద్వేల్ ఉప ఎన్నిక చప్పగా మారింది.

నిజానికి ఏపీలో జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ రెంటికీ ఓటు బ్యాంకే కాదు ఉనికే లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, బద్వేల్’లో బీజీపీకి అక్షరాల 3,125వస్తే కాంగ్రెస్ పార్టీకి 2,148 ఓట్లు వచ్చాయి . అంటే జాతీయ పార్టీలురెంటికీ కలిపి కూడా ఐదు వేలకు మించి ఓట్లు పడలేదు. కాంగ్రెస్’కు నోటా కంటే వెయ్యికి పైచిలుకు ఓట్లు తక్కువ ఓట్లు పోలైతే, బీజేపీకి నోటా కంటే ఆరు ఓట్లు తక్కువ పోలయ్యాయి. నోటాకు  3 వేల 31 ఓట్లు పోలయ్యాయి. జనసేనకు కూడా గొప్పగా ఏమీ ఓట్లు రాలలేదు, ఆపార్టీకి  4వేల 283 ఓట్లు మాత్రమే వచ్చాయి.గెలిచిన వైసీపీకి 84వేల 955 ఓట్లు వస్తే… టీడీపీ 76 వేల 603 ఓట్లు సాధించింది. ఈ లెక్కన చూస్తే, బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు  వ్రతం చెడ్డా  ఫలితం దక్కదని తెలిసిపోయింది.  అయినా జాతీయ పార్టీలు ఉప ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాయి అనేది, రాజకీయ పండితులకు కూడా పజిల్ గానే కనిపిస్తోంది.  

అయితే ఇదే ఓ రకంగా తిక్కే అయినా ఈ తిక్కకూ ఓ లెక్కుందని అంటున్నారు బీజేపే, కాంగ్రెస్ నాయకులు. “ఈఎన్నికల్లో ఓడిపోతామన్న విషయం మాకూ తెలుసు. కానీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రజల్లో ఎవరికీ ఎక్కవ ఆదరణ వుంది ..,, ముఖ్యంగా పోటీలో లేని తెలుగు దేశం పార్టీకి ఉన్న, 76 వేల పై చిలుకు ఓటర్లు, ఎటు వైపు మొగ్గు చూపుతారు ఉప ఎన్నిక ఫలితాలతో తేలిపోతుంది”.. అందుకే అ లెక్కేదో తేల్చుకునేందుకే పోటీకి దిగుతున్నామని జాతీయ పార్టీల నాయకులు చెప్పు కొస్తున్నారు.ఇదిలా ఉంటే తెలుగు దేశం పార్టీకి ఉండే లెక్కలు ఆ పార్టీకి ఉన్నాయని అంటున్నారు. వైసీపే వ్యతిరేక ఓటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఎటు మొగ్గు చూపుతారో తెలుసుకుని, భవిష్యత్ వ్యూహం రచించుకోవచ్చని, ఎన్నికల పొత్తులు నిర్నయిన్చుకోవచ్చని తెలుగు దేశం పార్టీ చూస్తోందన అంటున్నారు. అందుకే గెలుపు ఓటముల విషయంలో ఎలాంటి ఆసక్తి లేక పోయినా, జాతీయ పార్టీలలో జీరో ..ఎవరు ..హీరో ఎవరు తేల్చే ఎన్నికలుగా రాజకీయ వర్గాలు ఆసక్తి చూపుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.