Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అయోధ్య విరాళాల కుంభకోణంపై పార్లమెంటు ఆవరణలో విపక్షాల వినూత్న నిరసన.!
posted on: Jul 31, 2026 2:22PM
.webp)
భక్తులు శ్రీరాముడిపై ఉన్న అపారమైన విశ్వాసంతో తమ కష్టార్జితాన్ని హుండీలో కానుకలుగా సమర్పిస్తారు. అలా సమర్పించిన ప్రతి రూపాయి వెనుక పవిత్రమైన విశ్వాసం, ఆధ్యాత్మిక చింతన ఉంటాయి. అలాంటి కానుకలు దుర్వినియోగమైతే భక్తల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అయోధ్య రామాలయానికి భక్తుల సమర్పించిన విరాళాల విషయంలో అదే జరిగింది. అయోథ్య రాముడికి భక్తుల సమర్పించిన విరాళాల్లో 7.5 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగా యన్నవార్తలు దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.
ఆ అవకతవకలకు, అక్రమాలకు నిరసనగా పార్లమెంటు ఆవరణలో విపక్షాలు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశాయి. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
ఆ పూజారికి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా పలువురు విపక్ష ఎంపీలు విరాళాలు వేస్తుండగా, పప్పు యాదవ్ వారిచ్చిన సొమ్మును తన జేబులో వేసుకుంటూ చోరీ జరిగిన విషయాన్ని చాటారు. ఆ సందర్భంగా ఎంపీలు చఢావా చోర్, గద్దీ ఛోడ్ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. అయోధ్య విరాళాల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Ayodhya donation row, Pappu Yadav protest, Rahul Gandhi, Parliament Makar Dwar, Ram Mandir hundi theft, Opposition protest


.webp)
.webp)


