ఆటో డ్రైవర్ కుమారుడు.. ఇంటర్ లో 592 మార్కులు

పిల్ల‌వాడు పుట్టాడ‌ని ఆనందం కాదు వాడు ఎంతో ప్ర‌యోజ‌కుడు అయ్యాడ‌ని మ‌హదానందం  అన్నాడు త‌న కొడుకు గురించి  ఓ తండ్రి.  విద్యార్ధిగా త‌న కొడుకు ఎంతో అభివృద్ధి సాధించాడ‌ని ఉప్పోంగి పోతు న్నాడు ఈ మ‌హారాష్ట్ర అకోలాకి చెందిన ఆటో డ్రైవ‌ర్‌.  త‌న కొడుకు 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణుడయ్యా డు.  అదో  చెప్ప‌లేని ఆనందం. అంత‌కుమించిన‌దేమిటే మార్కులు 600కి గాను 592 మార్క‌లు సాధించాడు. అది  అత‌ని అంతులేని ఆనందానికి కార‌ణం. పైగా ఆ ఆటోడ్రైవ‌ర్ త‌న కొడుకు మార్కుల లిస్ట్‌ను త‌న మొబైల్లో  పెట్టి ఆటో ఎక్కిన అంద‌రికీ చూపించి తెగ మురిసిపోతున్నాడు. 

వికాస్ అరోరా  అనే వ్య‌క్తి  ఆ మార్కుల లిస్ట్‌ను నెట్‌లో పెట్టి మరింత ప్ర‌చారం చేసాడు. అంతే  45,500 మంది ఫాలో అయ్యారు.  అంతేకాదు  అంద‌రూ శుభాకాంక్ష‌లు చెబుతూ అత‌న్ని ఆనందంలో ముంచెత్తు తున్నారు.  కొంద‌ర‌యితే ఆ పిల్ల‌వాడు పెద్ద చ‌దువులు చ‌ద‌వాల‌నుకుంటే అందుకు త‌గిన సాయం అంది స్తాన‌ని కూడా మెసేజ్‌లు పెడుతున్నారు. చ‌దువుకునేవాడికి  తెలివి, చ‌ద‌వాల‌న్న ప‌ట్టుద‌ల వుంటే  చాలు ప‌రిస్థితులు వాటంత‌ట అవే అనుకూలిస్తాయి.  

ఇటువంటి మాట‌లు విన‌వ‌చ్చు, యాడ్స్ చూడ‌వచ్చు.  కానీ ఇది   వాస్త‌వం.  రాష్ట్ర ప్ర‌భుత్వాల మాట‌లు, మ‌ద్ద‌తులు ఎలా వున్నా, స‌మాజంలో మ‌నసున్న‌మారాజులు ఇంకావున్నారు. వాళ్ల‌లో ఒక్క‌రిద్ద‌ర‌యినా ఇలాంటి ఉత్త‌మ విద్యార్దుల‌కు ఆర్ధిక మ‌ద్ద‌తునిచ్చి ఆదుకుంటే నిజంగానే భ‌వి ష్యత్తులో  ఆ విద్యార్ధులు ఉన్న‌త స్థాయికి చేరుకోగ‌ల‌రు.  ప్ర‌భుత్వాలు త‌మ గొప్ప‌ల‌కు క్రీడాకారుల‌కు భారీ  నజరానాలు, భూములు ఇచ్చేయ‌డం కాకుండా  ఇలాంటి వారిని ఉత్సాహ‌ప‌రిచి  త‌మకు  అంద‌రూ స‌మాన‌మే అన్న‌ది నిరూపించుకోవాలి.  

విద్యారంగం అభివృద్ధి గురించి వుప‌న్యాసాలు దంచ‌డంకాకుండా  అస‌లు పాఠ‌శాల‌లు, ముఖ్యంగా గ్రామా ల్లో పాఠ‌శాల ప‌రిస్థితుల‌ను ఒక్క‌సారి మ‌న‌స్పూర్తిగా చూసి వాటిని స‌వ్యంగా న‌డుస్తున్న‌ది లేనిదీ ప‌రి శీలిం చి వాటిని మెరుగుప‌ర‌చాలి.  రాష్ట్రం ఏద‌యినాస‌రే, గ్రామీణ ప్రాంతాల్లో  బ‌డులు దారుణంగానే  వుంటు న్నాయ‌న్న‌ది చాలాకాలం నుంచి విన‌బ‌డుతున్న నివేదిక‌ల గోల‌.

పాఠశాల చ‌దువులు ఎలాంటి అడ్డం కులు లేకుండా సాగేట్టు ప్ర‌భుత్వాలు పూనుకుంటేనే మరింత మంది మట్టిలో మాణిక్యాల్లాంటి  విద్యార్ధులు వెలుగులోకి వ‌స్తారు.  బ‌డులకు రంగులు వేయ‌డం, బ‌ల్ల‌లు ఇచ్చామ‌ని కాకుండా ఉపాధ్యాయులు త‌గినంత మంది అందుబాటులో వున్నారా లేదా, మీడియాల విష‌యంలో గ‌ట్టి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, ప్రాథ‌మిక విద్య‌లో పిల్లల‌కు తెలుగు, ఇంగ్లీషుమాధ్యమాల విష‌యంలో స్ప‌ష్టత‌నీయ‌డం, విద్యార్థులను ప్రోత్సహించడానికి   అధికారులు పూను కోవాలి.