Top Stories

ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్

ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం (డిసెంబర్ 18) వినూత్న రీతిలో నిరసన తెలిపారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆటో డ్రైవర్ల  యూనిఫారంలో అసెంబ్లీకి హాజరయ్యారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆటో నడుపుతూ అసెంబ్లీకి వెళ్లారు.   ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేని ఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.  ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్  గుర్తు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా  రాష్ట్రంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని   కోరారు. అలాగే ఆటో డ్రైవర్లకు రూ. 12 వేల ఆర్ధిక సహాయాన్ని అందించాలని కోరారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.    లగచర్ల రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం (డిసెంబర్ 17) అసెంబ్లీకి నల్ల చొక్కా లు ధరించి, చేతులకు బేడీలు వేసుకొని అసెంబ్లీకి వచ్చిన సంగతి తెలిసిందే.   రోజుకో సమస్యపై వినూత్న నిరసనలతో  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం ఆసక్తి రేపుతోంది.
Publish Date: Dec 18, 2024 6:49PM

అపురూప శిల్పాలని ఇంత అందంగా పరిరక్షిస్తున్నాం!

 పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి నాగార్జునసాగర్ హిల్ కాలనీలో బస్టాండ్ కి వెళ్లే దారిలో గల శ్రీదేవి భూదేవి సమేత ఏలేశ్వర మాధవ స్వామి ఆలయ ప్రాంగణంలో కాకతీయుల కాలపు శిల్పకళాఖండాలు నిర్లక్ష్యంగా పడి ఉన్నాయని, వాటిని భద్రపరిచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ఏలేశ్వర స్వామి ఆలయం వెనక 700 సంవత్సరాల నాటి భిన్నమైన నంది, ఆలయ ద్వారశాఖలు, విడిభాగాలు, ఇంకా రెండు సహస్ర లింగాలున్నాయని, వాటిని ప్రాంగణంలోనే పీఠాలపై నిలబెట్టి, చారిత్రక వివరాలతో పేరు పలకలను(లేబుల్) ఏర్పాటు చేస్తే, భక్తులు, పర్యాటకులు వాటి వివరాలు తెలుసుకునే వీలు చిక్కుతుందన్నారు.  1954-60 మధ్యకాలంలో నాగార్జునసాగర్ జలాశయ నీటి ముంపు ప్రాంతమైన ఏలేశ్వరం నుంచి వీటిని తరలించి ఇక్కడికి చేర్చారని, గత 65 ఏళ్లుగా ఇవి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయని, చారిత్రక ప్రాధాన్యత గల ఈ 13వ శతాబ్ది కళాఖండాలను భద్రపరిచి, భావితరాలకు అందించాలని ఆలయ అధికారులకు, నందికొండ హిల్ కాలనీ వాసులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Publish Date: Dec 18, 2024 6:27PM

అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం సుప్రీంకు పోలీసులు?

అల్లు అర్జున్ మధ్యంతర బెయిలు రద్దు కోసం హైదరాబాద్ పోలీసులు హైకోర్టుకు, ఇంకా అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ఏ 11గా పోలీసులు కేసు నమోదు చేసి ఈ నెల 13న అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ప్రొసీజర్ అంతా పూర్తి చేసుకుని ఈ నెల 14 ఉదయమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.   అసలు విషయమేంటంటే.. అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా  ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద ఈ నెల 4న జరిగిన తొక్కిసలాటలో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ11 అల్లు అర్జున్ ను పోలీసులు ఈ నెల 13న అరెస్టు చేసి నాంపల్ల్లి కోర్టులో హాజరు పరచగా, నాంపల్లి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే అదే రోజు అల్లు అర్జున్‌ క్వాష్ పిటిషన్ పై   విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులు చంచల్‌గూడ జైలుకు   అందడంలో జాప్యం కారణంగా ఆయన ఒక రాత్రి జైలులో ఉండాల్సి వచ్చింది.ఆ మరుసటి రోజు అంటే  డిసెంబర్ 14  ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.   తాజాగా సేకరించిన ఆధారాల మేరకు వారు త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.     మరోవైపు ఈ ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని.. థియేటర్‌ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.  మీడియా నివేదికల ప్రకారం, భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని పుష్ప 2 బెనిఫిట్ షో ప్రదర్శన సమయంలో అల్లు అర్జున్ మరియు నటి రష్మిక మందన్నను థియేటర్ లోకి అనుమతించవద్దని సంధ్య థియేటర్ యాజమాన్యానికి సూచించినట్లు పోలీసులు ప్రాసిక్యూషన్, అదనపు అడ్వకేట్ జనరల్ కు లేఖ సమర్పించారు.   అల్లు అర్జున్ ను థియేటర్ లోకి అనుమతించవద్దని చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ కు రాసిన లేఖ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.  ప్రీమియర్ షోకు అల్లు అర్జున్  హాజరైతే సంధ్య థియేటర్ లో జనసమూహాన్ని నియంత్రించడం కష్టమవుతుందని పోలీసులు ఆ లేఖలో పేర్కొన్నారు. అదే కారణాన్ని పేర్కొంటూ, అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని మేజిస్ట్రేట్ ను అభ్యర్థిస్తూ పోలీసులు  అప్పీల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  
Publish Date: Dec 18, 2024 6:24PM

చెల్లెలి చావు తెలివి తేటలు.. తండ్రి సొమ్ము కోసం అన్నల మర్డర్ 

తండ్రి డెత్ బెనిఫిట్స్ కోసం ఓ కూతురు చావు  తెలివి తేటలు ప్రదర్శించింది. ఇద్దరు అన్నలను చంపేస్తే తండ్రి డెత్ బెనిఫిట్స్ మింగేయవచ్చు అని కలలు కన్నది. ఆమెకు ప్రియుడు దానయ్య తోడయ్యాడు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు అన్నలను మట్టు పెట్టింది. ఖేల్ ఖతమ్ అనుకుంది కానీ సీన్ రివర్స్ అయ్యింది. పల్నాడు జిల్లాలో డబుల్ మర్గర్ కేసులో ఈ చెల్లి  కటకటాలపాలైందిహత్యకు గురైన వారిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండటం గమనార్హం. తన ఇంట్లోనే చెల్లెలి  రూపంలో  ఓ కరడు గట్టిన నేరస్థురాలు ఉందని ఆ కానిస్టేబుల్ ఊహించలేకపోయాడు.   నకిరికల్ డబుల్ మర్దర్ కేసును పోలీసులు చేధించారు. ప్రియుడితో కల్సి స్కెచ్ వేసినప్పటికీ అది వికటించింది. నవంబర్ 26వ తేదీన  రక్తం పంచుకుని పుట్టిన అన్న  రామకృష్ణను చున్నీతో చంపేసింది  కృష్ణవేణి . శవాన్నిగోరంట్ల కాలువలో పడేసింది. ఈ మర్డర్ కేసులో ప్రియుడు దానయ్య పూర్తిగా సహకరించాడు.  ఈ మర్డర్ బయటపడలేదు. వెంటనే   కృష్ణవేణి మరో అన్నను మట్టు పెట్టాలని డిసైడ్ అయ్యింది.  అన్న గోపికృష్ణ కానిస్టేబుల్. స్వంత చెల్లెలు హత్య చేస్తుంది అని పసిట్టలేకపోయాడు. మద్యంలో విషం కలి చంపేసింది కృష్ణవేణి. ఈ డెడ్ బాడీని కూడా అదే గోరంట్ల కాలువలో పడేసింది. రెండు మర్డర్ లు ఒకే విధంగా ఉన్నట్లు పోలీసులకు డౌటొచ్చింది. కూపీ లాగితే స్వంత చెల్లెలు కృష్ణవేణి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చేధించారు. కృష్ణవేణికి ఆల్రెడీ పెళ్లి అయ్యింది. ప్రియుడు  దానయ్యమోజులో పడి విలాసాలకు అలవాటు పడింది.  అన్నలను చంపేస్తే నలుగురు టీనేజి యువకుల కోరిక తీరుస్తానని కృష్ణవేణి  ఆశపెట్టిందని పోలీసులు తెలిపారు.  కృష్ణవేణి డబ్బుల కోసం  స్వంత అన్నలను చంపడం  పల్నాడు జిల్లాలో సంచలనమైంది. పవిత్రమైన అన్నా చెల్లెల బంధానికే  ఈ కేసు మాయని మచ్చగా మిగిలింది. 
Publish Date: Dec 18, 2024 4:15PM

పొంగులేటి పొలిటికల్ బాంబులు తండ్రి కొడుకులపై పడతాయా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు 

మంత్రి పొంగులేటి సియోల్ పర్యటనలో ఉన్నప్పుడు చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.  ఫార్ములా ఈ రేస్ కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. ఎసిబి విచారణ చేపట్టాలని  ప్రభుత్వ ప్రదానకార్యదర్శి  శాంతకుమారి ఇప్పటికే లేఖ రాసిన సంగతి తెలిసిందే.  కెటీఆర్ మెడకు  ఫార్ములా ఈ రేస్ కుంభకోణం చుట్టుకుంది.  ఈ కుంభకోణంపై  ఎసిబి విచారణకు మంత్రివర్గం పట్టు బట్టింది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్  కొనుగోళ్లపై  జస్టిస్ మదన్ బి లోకూర్ ఇచ్చిన నివేదికపై కూడా  కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. జస్టిస్ మదన్ బి లోకూర్ ఇచ్చిన నివేదికపై కేబినేట్ భేటీ జరిగింది.  కెసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇస్టా రాజ్యంగా వ్యవహరించారు. కల్వంకుంట్ల ఫ్యామిలీ కోసమే పెద్ద పీట వేశారు. అవినీతి, బంధు ప్రీతి వల్ల రాష్ట్ర ప్రజల నెత్తిన భారం పెట్టారు. రాబోయే 25 ఏళ్ల పాటు కెసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని జస్టిస్  మదన్ బి లోకూర్ తేల్చేశారు.  కాలం చెల్లిన  టెక్నాలజీతో ఏర్పడిన  భద్రాది పవర్  ప్లాంట్ తో రానున్న 25 ఏళ్లలో 9 వేల కోట్ల అదనపు భారం  ప్రజలపై పడింది.  చత్తీస్ గడ్ తో చేసుకున్న  విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం వల్ల 3, 642 కోట్ల   నష్టం వాటిల్లిందని కమిషన్ తేల్చి చెప్పింది.  యూనిట్ మూడు రూపాయల అరవై పైసలకు కొనుగోలుచేసిన ప్రభుత్వం ఇంధన సర్దుబాటు పేరిట ఏడురూపాయలకు కొనడాన్ని కేబినెట్ ఆక్షేపించింది. మంత్రి పొంగులేటి సియోల్ పర్యటనలో ఉన్నప్పుడు దీపావళి తర్వాత పొలిటికల్ బాంబులు పేలతాయి అని ప్రకటించారు. ఫార్ములా ఈ రేస్ పై అవినీతినిరోధక శాఖ దర్యాప్తు చేపట్టడమే గాకుండా కెసీఆర్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై  కూడా దర్యాప్తు చేస్తే నేరం రుజువౌతుంది. దర్యాప్తు తర్వాత తండ్రి కొడుకులు అరెస్ట్ అయ్యే అవకాశముందని చర్చ జరుగుతుంది. 
Publish Date: Dec 18, 2024 2:00PM

జమిలీ బిల్లుకు డుమ్మా కొట్టిన బిజెపి ఎంపీలకు షోకాజ్ నోటీసులు 

లోకసభలో ఎన్డిఏ ప్రవేశ పెట్టిన జమిలీ బిల్లుకు బిజెపికి చెందిన ఎంపీలు డుమ్మా కొట్టారు. ఇంత కీలకమైన బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో అధికారపార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు గైర్హాజర్ కావడం  చర్చనీయాంశమైంది. కేంద్రమంత్రులైన గడ్కరీ, గిరిరాజ్, జ్యోతిరాదిత్య, సిపి పాటిల్ తదితరులు డుమ్మా కొట్టారు. విప్ జారీ చేసినప్పటికీ బిజెపి ఎంపీలు, ఐదుగురు కేంద్రమంత్రులు డుమ్మా కొట్టడం పట్ల బిజెపి అధిష్టానం సీరియస్ గా ఉంది. ,  ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. లోకసభలో బిజెపికి మెజార్టీ లేనప్పటికీ బిజెపి ఈ బిల్లును ప్రవేశ పెట్టింది ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దత్తు పలికింది. కానీ బిజెపి ఎంపీలు 20 మంది డుమ్మా కొట్టడం పట్ల అధిష్టానం సీరియస్ అయ్యింది. వారికి షోకాజ్ నోటీసులు పంపింది.  కేంద్ర న్యాయ శాఖా మంత్రి అర్జున్ రాం మేఘవాల్ ఈ బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టారు.   
Publish Date: Dec 18, 2024 11:38AM